మహబూబాబాద్ జిల్లా పొనుగోడులోని స్టోన్స్ క్రస్సర్లో అర్ధరాత్రి బాంబు బ్లాస్టింగ్ చేశారు. దీంతో.. గూడూరు మండలం పొనుగోడు గ్రామ శివారులోని రేణుక స్టోన్స్ క్రస్సర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బ్లాస్టింగ్ తో తమ గ్రామానికి ప్రమాదం జరుగుతుందని రేణుక క్రస్సర్ యాజమాన్యాన్ని గాజులగట్టు గ్రామస్తులు అడ్డగించారు. బాంబు పేలుళ్ళకు ఒక్కసారిగా భయంతో ఇళ్లలో నుంచి గ్రామస్తులు రోడ్లపైకి పరుగులు తీశారు. అంతేకాకుండా.. భారీ పేలుళ్ళకు ఇళ్ల గోడలకు బీటలు, ప్రమాదకరంగా నెర్రలు పడ్డాయని ఆరోపిస్తున్నారు.