పొద్దున్నే లేవగానే కొంతమందికి తినే అలవాటు ఉంటుంది.. అందులో స్వీట్స్ కోసం పళ్ళు కూడా కడగకుండా మరీ తింటారు.. ఇలా తినడం వల్ల ప్రాణాలకు రిస్క్ అని, అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఉదయాన్నే కేక్ లు, బిస్కెట్లు తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అసలు ఉదయాన్నే పరిగడుపున స్వీట్లను తింటే మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం…
స్వీట్లనే ముందు తినడం వల్ల పోషకాలు తీసుకోవడంపై ప్రభావం పడుతుంది. ఎందుకంటే స్వీట్లలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు ఉండవు. అందుకే మీరు తృణధాన్యాలు, పండ్లు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాల కంటే స్వీట్లను తింటే మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. దీంతో మీ ఆరోగ్యం దెబ్బతింటుంది.. స్వీట్లను ఎక్కువగా తింటే పోషకాల లోపం కలుగుతుంది.. షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని పరిగడుపున తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ త్వరగా పెరుగుతాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఇన్సులిన్ విడుదల చేయడానికి ప్యాంక్రియాస్ ను ప్రేరేపిస్తుంది. రక్తంలో చక్కెర పెరగడం, ఆ తర్వాత తగ్గడం వల్ల మీకు ఎన్నో సమస్యలు వస్తాయి.
అంతేకాదు త్వరగా నీరసంగా కూడా అవుతారు.. అలాగే ఒక్కోసారి ఎక్కువగా ఆకలివేస్తుంది.. ఉదయాన్నే తినడం వల్ల రోజంతా మరిన్ని తీపి ఆహారాలను తినాలన్న కోరిక కలుగుతుంది.న్యూరోట్రాన్స్మిటర్ డోపామైన్ విడుదలను ప్రేరేపిస్తుంది. మీ శరీరం చక్కెరపై ఆధారపడటాన్ని ఎక్కువ చేస్తుంది.. అలాగే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉండవు. మీ అల్పాహారంలో చక్కెర పదార్ధాలే ఎక్కువగా ఉంటే మీ శరీరం సరైన విధంగా పనిచేయదు.. అలాగే పరగడుపున స్వీట్స్ తినడం వల్ల ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, దంత సమస్యలతో సహా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. సో ఇది గుర్తు పెట్టుకొని ఉదయాన్నే స్వీట్స్ కు దూరంగా ఉండటం మంచిది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.