Madhu Goud Yaskhi: రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ ఉంటుందంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సొంత పార్టీ నాయకులు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మూల విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ కుండబద్దలు కొట్టారు. తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన రేవంత్‌కు బహిరంగ లేఖ రాశారు.
‘‘సర్వాయి పాపన్న, మహాత్మా జ్యోతిరావు ఫూలే, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య ఉద్యమ స్ఫూర్తిగా, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కుల సాక్షిగా బానిస సంకెళ్లు తెంచుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఏకమయ్యాయి. సమాన అవకాశాల కోసం పోరాటాలు చేస్తున్నాయి. అణచివేతకు, అవమానాలను సహించమని చెబుతున్న ఆ వర్గాలు.. తాము సాధించుకున్న తెలంగాణ నుంచి సామాజిక తెలంగాణ సాధించాలని ఆయా వర్గాలు బలంగా కోరుకుంటున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఇతర వర్గాలన్నీ కాంగ్రెస్ పార్టీ దిక్కుగా భావిస్తున్న ఈ తరుణంలో.. అన్ని పార్టీలకు రెడ్లు మాత్రమే నాయకత్వం వహిస్తే మనుగడ ఉంటుందని మీరు చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవి’’ అంటూ మధుయాష్కీ ఆ లేఖలో రేవంత్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు వ్యక్తిగతంగా మీకు, కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తాయని ఆయన హెచ్చరించారు.
Also Read
- CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
- Fruit Poisoning: నారాయణగూడలో ఘోరం.. మామిడిపండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- Amulya Sri: పాపం.. హీరోయిన్ అవ్వాలని వస్తే సూసైడ్ చేసుకునేలా చేశారు!
- CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
2004-2009లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే.. అది సోనియాగాంధీ నాయకత్వం, రెడ్డి-బీసీల కలయిక అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని రేవంత్‌కి మధుయాష్కీ సూచించారు. ఇది అర్థం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. 2023 లక్ష్యంగా అధికారంలోకి వచ్చేందుకు అన్నికులాలను, వర్గాలను కలుపుకుపోవాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోందన్నారు. మీరు చేసిన వ్యాఖ్యలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అవమాన పర్చేలా, కించపర్చేలా ఉన్నాయన్నారు. పీసీసీ అధ్యక్ష హోదాలో ఉంటూ బడుగుల, బలహీన వర్గాల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడడం తగదన్నారు. ఆ వ్యాఖ్యలపై వెంటనే వివరణ ఇవ్వాలని.. పార్టీలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాల్లో ఏర్పడ్డ ఆందోళనను, గందరగోళాన్ని నివృత్తి చేయాలని మధుయాష్కీ గౌడ్ తన లేఖలో రేవంత్ రెడ్డిని కోరారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్‌గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!