Fruit Poisoning: నారాయణగూడలో ఘోరం.. మామిడిపండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fruit Poisoning: ప్రతి సీజన్లో వచ్చే పండ్లు తింటే ఆరోగ్యం చేకూరుతుందని వైద్యులు చెబుతుంటారు. ఇక వేసవి రాగానే.. పుచ్చకాయలు, మామిడి పండ్లు తినేందుకు జనం ఇష్టపడుతుంటారు. మార్కెట్లు కూడా ఆయా రకాల పండ్లతో కళకళలాడుతుంటాయి. చిన్నా, పెద్దా అంతా ఇష్టంగా తినే ఆ పండ్లు సురక్షితమేనా? కొంత మంది వ్యాపారులు తమ లాభాల కోసం రసాయనాలతో పండించడం చూస్తూనే ఉన్నాం. ఫలితంగా మనం అమృతం అనుకుని తింటున్న ఆహారమే మన ప్రాణాలను తీసే విషంగా మారుతోంది.
ఆ అక్కాచెల్లెళ్ల పేర్లు భువనేశ్వరి, సంధ్య. ఈ ఇద్దరూ తమ కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని నారాయణగూడలో ఉంటున్నారు. అందరూ ఇష్టపడే మామిడిపండ్లను ఇష్టంగా తిని.. అస్వస్థతకు గురై ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు చనిపోవడం అందరినీ కలిచి వేస్తోంది. దీంతో కర్ణాటక బీదర్ నుంచి వలస వచ్చిన ఒక పేద కుటుంబంలో ఈ ఘటన కోలుకోలేని విషాదాన్ని నింపింది. సరిగ్గా నెల రోజుల క్రితం మహారాష్ట్ర రాజధాని ముంబైలోనూ బిర్యానీ, ఆ తర్వాత వాటర్ మిలన్ తినడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. గత ఏప్రిల్ 25న ముంబైలోని జేజే మార్గ్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. ఆ ఏరియాలో ఉండే అబ్దుల్లా డొకాడియా కుటుంబం ఓ పార్టీ నిర్వహించింది. పార్టీకి వచ్చిన అతిథులంతా వెళ్లిపోయాక అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అబ్దుల్లా ఆయన భార్య నస్రీన్, వారి కూతుళ్లు అయేషా, జైనెబ్ బిర్యానీ తిని, అనంతరం వాటర్ మిలన్ తిన్నారు. తర్వాత కొన్ని గంటల్లోపే వారికి తీవ్ర విరేచనాలు, వాంతులు ప్రారంభమయ్యాయి. దీంతో వెంటనే జేజే ఆస్పత్రికి వెళ్లినప్పటికీ, వారు చికిత్స పొందుతూ మరణించారు. అయితే.. ఇలా బిర్యానీ తిని, ఆ తర్వాత వాటర్ మిలన్ తినడంతోనే ఈ మరణాలు సంభవించాయా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ ఘటన సంచలనంగా మారింది. ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో నలుగురి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు.
Also Read
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
- Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
కేసు తీవ్రత దృష్ట్యా అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు పోలీసులు, వైద్య, ఫోరెన్సిక్ నిపుణులు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కూడా దర్యాప్తులో పాల్గొన్నారు. బాధితులు ఆహారం తీసుకున్నప్పటి ఫుడ్ శాంపిల్స్‌ను అధికారులు సేకరించారు. అయితే, వారు తిన్న వాటర్ మిలన్ ఎక్కడ తీసుకొచ్చారు అనే విషయంలోనే స్పష్టత రాలేదు. ఈ వాటర్ మిలన్ ఎక్కడ కొన్నారో కనుక్కోవడం అధికారులకు కష్టంగా మారింది. మొత్తానికి అబ్దుల్లా శరీరంలో మార్ఫైన్ అనే ప్రమాదకర రసాయనాన్ని ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. శరీరంలో అనేక అవయవాలు రంగు మారాయంటే ఏదో విష పదార్థం శరీరం అంతా వ్యాపించి ఉంటుందని నిపుణులు అనుమానించారు. దీంతో వారి మెదడు, గుండె, ఇతర జీర్ణావయవాలు అన్నీ ఆకు పచ్చ రంగులోకి మారిపోయినట్లు గుర్తించారు. మరోవైపు పండ్లు పండించడానికి వాడే ప్రమాదకరమైన రసాయనాలు దీనికి కారణమా? లేక మరేదైనా ఫుడ్ పాయిజనింగ్ జరిగిందా? అనే కోణంలో పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
మొత్తంగా.. ఈ రెండు ఘటనల్లో పండ్లు తిన్న తర్వాతే మృతి చెందడం ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తోంది. పండ్లు కొనాలంటేనే జనం భయపడే పరిస్థితి నెలకొంది. గతంలో ముంబైలో ఈ ఘటన తర్వాత వాటర్ మిలన్ అమ్మకాలు విపరీతంగా పడిపోయినట్లు చెబుతున్నారు. పండ్లలో విష రసాయనాలు వాడుతున్నారనే ప్రచారం.. వాటి విక్రయాలపై ప్రభావం చూపింది. ఐతే పండ్లలో రసాయనాలతో కలుషితం చేస్తున్న వారిపై.. తూతూ మంత్రంగా కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జనం డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!