Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చరిత్ర పుటల్లో కొన్ని రహస్యాలు కాలంతో పాటు సమాధి అయిపోతాయి, కానీ మరికొన్ని రహస్యాలు కాలక్రమేణా మరింత శక్తివంతంగా మారి ప్రపంచాన్నే భయపెడతాయి. అలాంటి ఒక విచిత్రమైన, ప్రమాదకరమైన రహస్య భాషే ‘ఫెన్యా’. రష్యా చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయమైన జోసెఫ్ స్టాలిన్ పరిపాలన కాలంలో.. గులాగ్ శ్రమ శిబిరాల జైళ్లలో పుట్టిన ఒక విచిత్రమైన రహస్య భాష ఇది. 1929 నుంచి 1953 మధ్య కాలంలో దాదాపు రెండు కోట్లకు పైగా ప్రజలను కరడుగట్టిన నేరస్థులతో పాటు రాజకీయ ఖైదీలుగా ఈ జైళ్లలో బంధించారు. అక్కడ జైలు అధికారుల నిఘా నుంచి తప్పించుకోవడానికి, ఖైదీలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఒక రహస్య సంకేత భాషను సృష్టించుకున్నారు. నిజానికి దీని మూలాలు 17వ శతాబ్దపు సంచార వ్యాపారుల కాలంలో ఉన్నప్పటికీ, సోవియట్ జైళ్లలోనే ఇది ఒక పూర్తి స్థాయి క్రిమినల్ కోడ్ లాంగ్వేజ్‌గా రూపాంతరం చెందింది. ఈ భాష ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో వాడే పదాలు పైకి చాలా సాధారణంగా అనిపిస్తాయి కానీ వాటి వెనుక ఉండే అసలు అర్థాలు పూర్తిగా భిన్నంగా, ప్రమాదకరంగా ఉంటాయి.
ఉదాహరణకు సాధారణ రష్యన్ భాషలో ‘అమ్మమ్మ’ అని అర్థం వచ్చే ‘బాబ్కీ’ అనే పదాన్ని ఈ కోడ్‌లో ‘డబ్బు’ అనే అర్థంలో వాడతారు. అలాగే సమాజంలో ‘చెత్త’ అని పిలిచే ‘ముసోర్’ అనే పదాన్ని వీరు ‘పోలీసు లేదా డిటెక్టివ్’ అనే అర్థంలో ఉపయోగిస్తారు. చదువుకునే ‘విశ్వవిద్యాలయాన్ని’ వీరు ‘జైలు’ అని, తినే ‘రాస్ప్బెర్రీ పండును’ ఒక ‘రహస్య స్థావరం’ అని పిలుచుకుంటారు. ఇలాంటి పదాల వల్ల జైలు అధికారులు పక్కనే ఉన్నా ఖైదీలు ఏం మాట్లాడుకుంటున్నారో వారికి అస్సలు అర్థమయ్యేది కాదు. స్టాలిన్ మరణం తర్వాత జైళ్ల నుండి విడుదలైన లక్షలాది మంది ఖైదీలు ఈ భాషను సమాజంలోకి తీసుకువచ్చారు. కాలక్రమేణా ఇది రష్యన్ సంస్కృతిలో, సాహిత్యంలో ఎంతగానో కలిసిపోయింది. చివరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వంటి అగ్రనేతలు కూడా కొన్నిసార్లు తమ అధికారిక ప్రసంగాలలో ఈ ఫెన్యా పదాలను ఉపయోగించడం విశేషం.
Also Read
- Italy Protests: ఇటలీలో జెన్-ఆల్ఫా విధ్వంసం.. రూ. 4,400 కోట్లు బూడిద!
- Modi-Netanyahu: భారత్‌తో సంబంధాలపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
- Canadian Military: కెనడా మిలిటరీ శిక్షణలో తీవ్ర విషాదం.. నలుగురు సైనికులు మృతి, 39 మందికి గాయాలు
- Israel: ఇజ్రాయెల్-వియన్నా విమానానికి బాంబ్ బెదిరింపు.. ఎమర్జెన్సీ కోడ్‌తో అలర్ట్
అయితే, వందల సంవత్సరాల నాటి ఈ జైలు భాష ఇప్పుడు ఇంటర్నెట్ చీకటి ప్రపంచమైన ‘డార్క్ వెబ్’ లోకి ప్రవేశించి ‘సైబర్-ఫెన్యా’గా అవతరించింది. రష్యన్ సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ దాడులు చేయడానికి, ఒకరితో ఒకరు వ్యూహాలు పంచుకోవడానికి ఇప్పుడు ఈ భాషను ఒక శక్తివంతమైన ఆయుధంగా వాడుకుంటున్నారు. వారు తమ సంభాషణలను కంప్యూటర్ నిఘా వ్యవస్థలు లేదా భద్రతా సంస్థలు పసిగట్టకుండా ఉండటానికి రష్యన్ బూతులతో పాటు ఈ ఫెన్యా కోడ్ పదాలను కలిపి వాడుతున్నారు. లీకైన కొన్ని హ్యాకర్ల చాట్ గ్రూపులను పరిశీలిస్తే, వారు తమ ఈమెయిల్స్ బ్లాక్‌లిస్ట్‌లో పడకుండా రక్షించుకోవడాన్ని “నా సబ్బులు స్నానం చేయడం లేదు, వాటిని నెలల తరబడి వేడి చేస్తున్నాను” అని మాట్లాడుకుంటున్నారు.
ఇలాంటి సంభాషణలను అనువదించడంలో నేటి అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్లు కూడా పూర్తిగా విఫలమవుతున్నాయి. ఎందుకంటే ఎఐ సాంకేతికత పదాల నిఘంటువు అర్థాలను మాత్రమే గ్రహించగలదు కానీ, సందర్భాన్ని బట్టి మారిపోయే ఫెన్యా అంతరార్థాలను పసిగట్టలేదు. పైగా ఈ నేరగాళ్లు ఒక పదం పాతబడగానే దానికి బదులు కొత్త పదాన్ని సృష్టిస్తూ నిరంతరం భాషను మారుస్తూ ఉంటారు. దీంతో అంతర్జాతీయ సైబర్ నేర పరిశోధకులకు ఇదొక పెద్ద తలనొప్పిగా మారింది. ఆధునిక హ్యాకర్లను పట్టుకోవడానికి కేవలం కంప్యూటర్ కోడింగ్ తెలిస్తే సరిపోదని, శతాబ్దాల క్రితం జైలు గోడల మధ్య పుట్టిన ఈ విచిత్రమైన ‘ఫెన్యా’ భాషా కోడ్లను కూడా నేర్చుకోవాల్సి వస్తోందని భద్రతా నిపుణులు చెబుతున్నారు. నేటి డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత పెరిగినా, ఈ ప్రాచీన రహస్య భాష అంతకంటే వేగంగా మారుతూ ప్రపంచ భద్రతకే సవాలు విసురుతోంది.
తాజావార్తలు
-
Karthik Subbaraj: చిరంజీవికి కథ చెప్పా.. బాల్ మెగాస్టార్ కోర్టులో ఉంది
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
YSRCP : స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ..
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!
ట్రెండింగ్
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
-
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
-
Vaibhav Sooryavanshi: ఆ ముగ్గురిలో ఒకరు తప్పుకుంటూనే వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.!
-
108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!