Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
- నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
- ను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు
- ట్రంప్‌తో కలిసి అడ్డుకున్నట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్ర శక్తిగా మారదని వ్యాఖ్యానించారు. తన పాలనలో ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను అభివృద్ధి చేయలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో తాను, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పూర్తిగా ఏకీభవిస్తున్నామని తెలిపారు.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వేళ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ అణ్వస్త్ర శక్తిగా మారకుండా నిరోధించే విషయంలో తాను, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి ఏకాభిప్రాయంతో ఉన్నామని పేర్కొన్నారు. గత మూడు దశాబ్దాలుగా తాను ఇరాన్‌పై అంతర్జాతీయ యుద్ధం చేయకపోయి ఉంటే.. ఇజ్రాయెల్‌ను నాశనం చేయగల అణుబాంబును ఇరాన్ ఎప్పుడో అభివృద్ధి చేసి ఉండేదని చెప్పుకొచ్చారు. తాను ప్రధానమంత్రిగా కొనసాగినంత కాలం.. ఇరాన్‌ను అణ్వాయుధాలు సంపాదించుకోనివ్వనని నెతన్యాహు స్పష్టం చేశారు.
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ఇరాన్ అణ్వాయుధాలను నిర్మించలేకపోతుంది.
‘‘నేను 30 ఏళ్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ అణు కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాను. నేను ఈ పోరాటం చేయకపోయి ఉంటే.. ఇజ్రాయెల్‌ను నాశనం చేయడానికి ఇరాన్ ఎప్పుడో ఒక అణు బాంబును అభివృద్ధి చేసి ఉండేది. ఇరాన్ మన దేశాన్ని నాశనం చేయాలని చూస్తోంది. వారిని ఆపడానికి నేను చేయగలిగినదంతా చేస్తున్నాను. నేను ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం.. ఇరాన్ కల ఎప్పటికీ నెరవేరదు.’’ అని నెతన్యాహు అన్నారు.
ఇరాన్ అణు కార్యక్రమాన్ని అమెరికా-ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తున్నాయి. ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధానికి అణు కార్యక్రమమే ప్రధాన కారణం. ఇరాన్ ఏళ్లుగా తన అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తుండగా.. అమెరికా దానిని నిరంతరం వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇరాన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అణుశక్తిగా ఎదగనివ్వనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు బహిరంగంగా ప్రకటించారు. ఇటీవల.. ఇరాన్‌తో సంఘర్షణ ముగింపు దశకు చేరుకుందని.. టెహ్రాన్ అణు ఆశయాలను ఏదో ఒక విధంగా అడ్డుకుంటామని ప్రకటించారు.
తాజావార్తలు
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!