తెలంగాణలోని ఆర్మూర్ చికెన్ ఎంత ఫేమస్సో చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి ప్రత్యేకంగా వండించుకొని తెప్పించుకుంటారు. గతంలో ఆర్మూర్ నాటుకోడి చికెన్, నలుగురు వ్యక్తులు తినగలిగే భోజనం ధర కలిపి రూ. 650 వరకు ఉండేది. అయితే, గత కొంతకాలంగా దేశీయ నాటుకోళ్లు అందుబాటులో లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దేశీయంగా ఉన్న నాటు కోళ్లను తీసుకొచ్చి ఆర్మూర్ చికెన్‌ను వండి పెడుతున్నారు. లోకల్ నాటుకోళ్లకు కొరత ఏర్పడటంతో ధరలు భారీగా పెంచేశారు.
Read: Ukraine Crisis: క్రిమియా నుంచి ఉపసంహరణ… కానీ…
గతంలో రూ. 650 ఉన్న నాటుకోడి భోజనం ఇప్పుడు రూ. 900కి పెరిగింది. రూ. 250 పెరిగినప్పటికీ లోకల్ కోడికూరను తినాలని అనుకున్న భోజన ప్రియులు ధరలను లెక్కచేయకుండా ఆర్డర్లు ఇస్తున్నారు. ఒకప్పుడు ఆర్మూర్ లో మాత్రమే ఉన్న ఈ ఆర్డర్ మెస్‌లు ఇప్పుడు ప్రతీ గ్రామంలో వెలిశాయి. ఎన్ని ఆర్డర్ మెస్‌లు వెలిసినా అన్ని మెస్‌లకు సరిపడా ఆర్డర్లు వస్తున్నాయి. గతంలో ఆ ప్రాంతంలో ఒక్కో నాటుకోడి రూ. 320 ఉండగా, ఇప్పుడు రూ. 420 వరకు కొనుగోలు చేస్తున్నారు. కోనుగోలు ధర పెరగడంతో నాటుకోడి కర్రి ప్లస్ భోజనం కలిపి రూ. 900 వరకు ఛార్జ్ చేస్తున్నారు.