తెలంగాణ ఉద్యమం ఉద్యోగాల కోసం జరిగిందన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. విభజన లో ప్రధాన పాత్ర పోషించిన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీది. విద్యార్ధుల ప్రాణాలు కోల్పోవద్దు అని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు.
ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల త్యాగం మరవలేము. రాహుల్ గాంధీ నీ ఉస్మానియా యూనివర్సిటీ కి తీసుకువస్తాం. రాజకీయాలకు సంబంధం లేకుండా యూనివర్సిటీ వెళ్తారు. యూనివర్సిటీ సందర్శించి.. విద్యార్థులతో మాట్లాడతారు. యూనివర్సిటీ సమస్యలు..ఉద్యోగాల భర్తీ మీద మాట్లాడతారు. సమస్యలు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువచ్చే అవకాశం వుంది. రాజకీయాలకు సంబంధం లేకుండా.. రాహుల్ గాంధీ సమావేశం జరుగుతుందన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.