తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ఇకపై 'నో-ఫ్లై జోన్'గా ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయం పైన లేదా దాని చుట్టుపక్కల డ్రోన్లను ఎగురవేయడంపై నిషేధం విధించింది.
ఐసీస్ మోడల్ ఆపరేషన్ ని పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాదులో పేలుళ్లకు ప్లాన్ చేసిన వ్యక్తులను పట్టుకున్నారు. ఆంధ్ర తెలంగాణ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా.. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్‌కు చెందిన సమీర్ అరెస్టు చేశారు. సీరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేశాడు. శిరాజ్, సమీర్ కలిసి డమ్మీ బ్లాస్ట్ కు ప్లాన్ చేశారు. ఐసీస్ మాడ్యూల్ సౌదీ అరేబియా నుంచి శిరాజ్, సమీర్ కు ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ తో…
CM Revanth Reddy : ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావం ప్రకటిస్తూ ర్యాలీలో పాల్గొనాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మే 8 గురువారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ఈ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత భారీగా పాల్గొనాలని ఆయన కోరారు. ఇక బుధవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన సివిల్ మాక్‌డ్రిల్…
Pahalgam Attack : పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికలతో తెలంగాణలో హై అలెర్ట్ ప్రకటించబడింది. దేశవ్యాప్తంగా ఉగ్రదాడుల అవకాశాలపై వచ్చిన విశ్వసనీయ సమాచారంతో రాష్ట్ర పోలీసు శాఖ పూర్తిగా అప్రమత్తమైంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని కేంద్రంగా చేసుకుని హెచ్‌ఐసీసీ, సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో కఠినమైన భద్రతా చర్యలు చేపట్టబడ్డాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి (CS) శాంతికుమారి, రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని అలెర్ట్ చేయగా, డీజీపీ అనjani కుమార్ రాష్ట్రంలోని ఉన్నతాధికారులకు…
హైదరాబాద్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సూచించారు. వీసా గడువు తీరిన చాలా మంది బంగ్లా, పాక్ దేశస్థులు హైదరాబాద్‌లో ఉన్నారన్నారు. వీరందరిని వెంటనే వెనక్కి పంపి వేయాలని డిమాండ్ చేశారు. వీరి ఏరివేతకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ ఉన్నారని గతంలో చాలా సందర్భాల్లో రుజువైందని.. స్లీపర్ సెల్స్ కు హైదరాబాద్ ఎంపీ మద్దతు ఉందని ఆరోపించారు.