TRS Plenary: పార్టీ శ్రేణులు, ప్లీనరీ ప్రతినిధులకు కేటీఆర్ కీలక సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ గులాబీ మయం అవుతోంది.. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఊరు వాడ, పల్లె పట్నం అనే తేడా లేకుండా ముస్తాబు అవుతోంది.. ఇక, టీఆర్ఎస్ ఫౌండేషన్ డేను పురస్కరించుకుని ప్లీనరీ నిర్వహిస్తున్నారు.. ప్లీనరీలో రేపు ఉదయం 11 గంటలకు గులాబీ పార్టీ బాస్, సీఎం కేసీఆర్ కీలక ప్రసంగాన్ని చేయబోతున్నారు.. ఈ నేపథ్యంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ జనరల్ సెక్రటరీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. కీలక సూచనలు చేశారు.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు జెండా పండుగలో పాల్గొనాలని.. ప్రతి గ్రామంలో గ్రామ కమిటీ, సర్పంచ్, ఎంపీటీసీ, రైతు బంధు కమిటీ సభ్యులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు అంతా కలిసి గ్రామంలోని పార్టీ శ్రేణులతో అందరినీ కలుపుకొని ఈ జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించాలని.. ఉదయం 9 గంటలకు తెలంగాణలో ఉన్న అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాలి.. దీంతోపాటు పట్టణాల్లోని బస్తీలు వార్డ్ కమిటీల ఆధ్వర్యంలో జెండాలు ఎగురవేయాలి.. ఈ జెండా పండుగకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు అన్నింటిని ఈరోజు సాయంత్రంలోగా పూర్తి చేసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమం పార్టీ ప్రతినిధుల కార్యక్రమం అనే విషయాన్ని మనం నియోజకవర్గాల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు పార్టీ శ్రేణులకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు కేటీఆర్.. కేవలం పార్టీ పంపించిన పాస్ ఉన్న వారికి మాత్రమే ఆహ్వానం ఉన్నదన్న విషయాన్ని అందరూ గమనించాలన్న ఆయన.. ఇప్పటి నుంచే పార్టీ నిర్దేశించిన ప్రతినిధులకు పాసులు అందినవో, లేవో చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందని, ఈ అంశానికి సంబంధించి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పార్టీని సంప్రదించాలని సూచించారు. దీంతోపాటు సరైన సమయానికి రేపు 9 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకునేందుకు అవసరమైన రవాణా, వాహన సదుపాయాలకు సంబంధించి కూడా ఏర్పాట్లను ఒకసారి పర్యవేక్షించాలని.. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సమావేశానికి వస్తున్న ప్రతినిధులకు సూచనలు చేశారు. ఖచ్చితంగా హైటెక్స్ ప్రాంగణానికి 9 గంటల లోపల చేరుకొని, తమ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలన్న కేటీఆర్.. ప్రతి ఒక్కరు గులాబీ దుస్తులను ధరించి రావాలి.. 10 గంటల లోపల సమావేశమందిరంలో ఆసీనులు కావాలి.. పార్టీ సమావేశం ప్రారంభమైన 10 గంటల నుంచి కార్యక్రమం ముగిసేంత వరకు సభా కార్యక్రమాలకు క్రమశిక్షణతో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.. సమావేశంలో పార్టీ తరఫున ప్రతిపాదించే తీర్మానాలకు సంబంధించిన ప్రతులను సభకు హాజరైన ప్రతినిధులకు ఇచ్చే బ్యాగ్‌లో ఉంచడం జరుగుతుంది.. ఈ తీర్మానాలకు సంబంధించిన అంశాలపై జరిగే సభా కార్యక్రమాలు అత్యంత ముఖ్యమైనవి అన్నారు కేటీఆర్.. ప్రస్తుతం రాజకీయంగా ప్రతిపక్షాలు లేవనేత్తే వివిధ రకాల ప్రశ్నలకు ఇందులో సమాధానం దొరుకుతుంది.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వివిధ అంశాలపై దిశానిర్దేశం జరుగుతుందన్నారు. ప్రతినిధులు తిరిగి వెళ్ళిన తర్వాత తీర్మానాలకు సంబంధించిన చర్చను తమ కార్య క్షేత్రాలలో కొనసాగించాలని కీలక సూచలను చేశారు మంత్రి కేటీఆర్.
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్‌కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!