Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
- ఇంట్లోనే తాజా గులాబీ రేకులతో సహజమైన రోజ్ వాటర్‌ను తయారు..
- రోజ్ వాటర్‌ను ఫేస్ టోనర్, ఫేస్ మిస్ట్‌గా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rose Water: చర్మాన్ని అందంగా, తాజాగా ఉంచుకోవడానికి చాలామంది రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. వాటిలో రోజ్ వాటర్ (గులాబీ నీరు) ప్రముఖంగా ఉపయోగించే బ్యూటీ ప్రొడక్ట్స్‌లో ఒకటి. ఇది చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతో పాటు చల్లదనాన్ని అందించడంలో, చర్మం పీహెచ్ బ్యాలెన్స్‌ను కాపాడడంలో, ముఖానికి సహజమైన కాంతిని అందించడంలో సహాయపడుతుందని భావిస్తారు. ముఖ్యంగా వేసవిలో సన్‌బర్న్ కారణంగా కలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి, చర్మాన్ని ఫ్రెష్‌గా ఉంచడానికి రోజ్ వాటర్‌ను చాలామంది ఉపయోగిస్తారు.
మార్కెట్లో రోజ్ వాటర్ సులభంగా లభిస్తుంది. అయితే కొద్దిపాటి శ్రమతో ఇంట్లోనే గులాబీ రేకులతో రోజ్ వాటర్ తయారు చేసుకోవచ్చు. దీనిని టోనర్ లేదా ఫేస్ మిస్ట్‌గా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఫేస్ ప్యాక్‌లో కలిపి కూడా అప్లై చేయవచ్చు. మరి ఇంట్లో రోజ్ వాటర్ తయారీకి కావాల్సినవి..
Also Read
- Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
* తాజా గులాబీ రేకులు – 3 కప్పులు
* శుభ్రమైన నీరు – 3 కప్పులు
మొదటి పద్ధతి..
ముందుగా గులాబీ రేకులను శుభ్రంగా కడగాలి. అనంతరం ఒక పాత్రలో శుభ్రమైన నీటిని పోసి అందులో గులాబీ రేకులను వేయాలి. రేకులు పూర్తిగా నీటిలో మునిగేంత మేర మాత్రమే నీటిని తీసుకోవాలి. ఇప్పుడు పాత్రను మీడియం మంటపై ఉంచి నీటిని మెల్లగా వేడి చేయాలి. నీటిని ఎక్కువ మంటపై పెట్టి బాగా మరిగించకూడదు. కొంత సమయం తర్వాత గులాబీ రేకుల రంగు, సువాసన నీటిలోకి చేరడం ప్రారంభమవుతుంది. రేకులు తమ రంగును పూర్తిగా కోల్పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ నీటిని వడకట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. అనంతరం శుభ్రమైన గాజు సీసా లేదా స్ప్రే బాటిల్లో నింపి ఫ్రిజ్‌లో ఉంచాలి. దీనిని ఫేస్ టోనర్ లేదా ఫేస్ మిస్ట్‌గా ఉపయోగించుకోవచ్చు.
రెండో పద్ధతి..
ముందుగా గులాబీ రేకులను శుభ్రంగా కడిగి ఒక పాత్రలో వేయాలి. రేకులు పూర్తిగా మునిగేంత వరకు నీటిని పోయాలి. అనంతరం పాత్రను మీడియం మంటపై ఉంచాలి. నీరు వేడెక్కడం ప్రారంభమైనప్పుడు పాత్రపై మూతను తలకిందులుగా పెట్టాలి. ఆ మూతపై కొన్ని ఐస్ ముక్కలను ఉంచాలి. ఇలా చేయడం వల్ల పాత్రలో ఏర్పడే ఆవిరి చల్లటి మూతను తాకి నీటి బిందువులుగా మారుతుంది. ఆ బిందువులు పాత్రలోకి చేరుతాయి. ఇలా సేకరించిన నీటినే రోజ్ వాటర్‌గా ఉపయోగించవచ్చు. కొంత సమయం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, తయారైన రోజ్ వాటర్‌ను వడకట్టాలి. అనంతరం శుభ్రమైన బాటిల్లో నింపి ఫ్రిజ్‌లో భద్రపరచాలి.
ఇంట్లో తయారు చేసుకున్న రోజ్ వాటర్‌ను మీ రోజువారీ స్కిన్ కేర్ రొటీన్లో భాగంగా చేసుకోవచ్చు. ఇది ముఖానికి ఫ్రెష్‌నెస్‌ను అందించడంతో పాటు చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే గులాబీ రేకులకు పురుగుమందులు లేదా ఇతర రసాయనాలు ఉండే అవకాశం ఉన్నందున, స్కిన్ కేర్ కోసం కెమికల్ ట్రీట్మెంట్ చేయని, శుభ్రమైన గులాబీలను మాత్రమే ఉపయోగించడం మంచిది. తయారు చేసిన రోజ్ వాటర్‌ను శుభ్రమైన సీసాలో ఫ్రిజ్‌లో ఉంచి, వాసన లేదా రంగులో మార్పు కనిపిస్తే ఉపయోగించకపోవడం మంచిది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!