Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- మేడ్ ఇన్ చైనా సీసీటీవీ కెమెరాలతో పాక్కు లైవ్ టెలికాస్ట్..
- పంజాబ్ లూథియానాలో ఐఎస్ఐ గూఢచర్యం వెలుగులోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pak Spy Network Busted: పాకిస్తాన్ గూఢచారం సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) కుట్ర బయటపడింది. పాకిస్తాన్ తరుఫున గూఢచర్యం చేస్తున్న 22 ఏళ్ల దుకాణదారుడిని పంజాబ్లో అరెస్ట్ చేశారు. లూథియానా మార్కెట్లో నిందితుడు ఒక షూ దుకాణాన్ని నడిపేవాడు. పోలీసులు కథనం ప్రకారం.. అతను లూథియానా నగరం సమాచారాన్ని పాకిస్తాన్కు పంపేవాడని తేలింది. దుకాణం బయట అమర్చిన మేడ్ ఇన్ చైనా సీసీటీవీ కెమెరాలతో పాకిస్తాన్కు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నట్లు వెల్లడైంది. ఒక సమాచారం మేరకు నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.
లూథియానాలో ఒక భారీ దాడి జరిపేందుకు పాకిస్తానీ ఏజెన్సీలు పన్నిన కుట్రలో భాగంగా ఈ గూఢచర్యం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. సైనిక కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను కూడా ఈ నెట్వర్క్ పాకిస్తాన్కు చేరవేస్తున్నట్లు తేలింది. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏఐజీ సిమ్రత్ పాల్ సింగ్ ధిండ్సా ప్రకారం, విచారణ సమయంలో నిందితుడు పాకిస్థాన్లోని తన హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు లుధియానా-ఫిరోజ్పూర్ రోడ్డుపై ఒక దుకాణాన్ని అద్దెకు తీసుకున్నట్లు వెల్లడించాడు. ఆ దుకాణం బధోవాల్ ఆయుధ డిపోకు సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. అతను నెలకు 40,000 రూపాయలు అద్దెగా చెల్లిస్తున్నాడు.
Also Read
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
నిందితుడు దుకాణం బయట, రోడ్డు వైపు చూసే విధంగా చైనాలో తయారైన రెండు సీసీటీవీ కెమెరాలను అమర్చాడు. పాకిస్తాన్ నుంచి అతడి హ్యాండర్లు ఏం జరుగుతుందనే వివరాలను గమనించేవారు. ఈ పని చేస్తున్నందుకు నిందితుడికి పాక్ హ్యాండర్లు సుమారు 3 లక్షల రూపాయలు ఇచ్చినట్లు తెలిసింది. దుకాణం పెద్దగా నడవకున్నా అద్దె చెల్లిస్తూ, సీసీటీవీ కెమెరాల దిశను తరుచుగా మార్చడాన్ని చూసి ఇతడిని అనుమానించారు. ఆగస్టు 27న అందిన సమాచారం ఆధారంగా, లుధియానా కమిషనరేట్ పోలీసులు మరియు లుధియానా కౌంటర్ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా చర్య తీసుకుని రచ్పాల్ సింగ్ను అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!