మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
- ఇంట్లోనే సులభంగా..
- కాజూ కట్లీ తయారీ ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaju Katli Recipe: మార్కెట్లలో ఎన్నో రకరకాల స్వీట్లు సందడి చేస్తుంటాయి. వాటిలో కాజూ కట్లీకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అయితే పండుగ సీజన్లో మార్కెట్లో లభించే స్వీట్లలో కల్తీ ఉంటుందేమోననే ఆందోళన చాలామందిలో ఉంటుంది. మరోవైపు కాజూ కట్లీ ధర కూడా కిలోకు రూ.1000 నుంచి రూ.1500 వరకు ఉండటంతో కొనాలంటే జేబుకు భారంగానే ఉంటుంది. అందుకే ఈసారి కాజూ కట్లీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకొనేలా ప్లాన్ చేయండి. కేవలం కాజూ, చక్కెర ప్రధాన పదార్థాలతోనే మార్కెట్లో లభించే విధంగా మెత్తగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయే కాజూ కట్లీని తయారు చేయవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. సరిగ్గా చేస్తే సుమారు 15 నిమిషాల్లోనే కాజూ కట్లీ సిద్ధమవుతుంది. మరి అది ఎలానో చూసేద్దామా..
కావాల్సిన పదార్థాలు:
* కాజూ (జీడిపప్పు) – 2 కప్పులు (సుమారు 250 గ్రాములు).
* చక్కెర – 1 కప్పు.
* నీరు – అర కప్పు.
* యాలకుల పొడి – పావు టీ స్పూన్ (ఐచ్ఛికం).
* నెయ్యి – 1 టీ స్పూన్.
* వెండి వర్క్ – అలంకరణ కోసం (ఐచ్ఛికం).
Also Read
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
కాజూ కట్లీ తయారీ విధానం:
ముందుగా కాజూలను మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీని వరుసగా ఎక్కువసేపు తిప్పకుండా.. రెండు, మూడు సెకన్ల పాటు పల్స్ మోడ్‌లో ఆన్ చేసి ఆపుతూ కాజూలను మెత్తని పొడిగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాజూల నుంచి నూనె బయటకు రాకుండా ఉంటుంది. తయారైన కాజూ పొడిని సన్నని జల్లెడతో వడకట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఒక కప్పు చక్కెర, అర కప్పు నీటిని వేసి మీడియం మంటపై ఉంచాలి. చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత మరో రెండు, మూడు నిమిషాలు మరిగించాలి. చక్కెర పాకం కొద్దిగా చిక్కగా మారి, సగం తీగ పాకం వచ్చే స్థితికి చేరుకోవాలి.
ఇప్పుడు మంటను తగ్గించి, సిద్ధం చేసుకున్న కాజూ పొడిని కొద్దికొద్దిగా చక్కెర పాకంలో వేస్తూ నిరంతరం కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మిశ్రమంలో ఉండలు ఏర్పడకుండా ఉంటుంది. కాజూ, చక్కెర మిశ్రమాన్ని తక్కువ మంటపై సుమారు 4 నుంచి 5 నిమిషాలు నిరంతరం కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం కడాయి అడుగు భాగాన్ని వదిలి ఒకచోటికి చేరడం ప్రారంభించినప్పుడు కాజూ ముద్ద సిద్ధమైనట్లు అర్థం చేసుకోవచ్చు. చిన్న మొత్తంలో మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకుని చేత్తో ఉండలా చేసేందుకు ప్రయత్నించాలి. అది చేతులకు అంటుకోకుండా ఉండలా వస్తే వంటకం సరైన స్థితికి వచ్చినట్లు.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని కొద్దిగా గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. ఒక బటర్ పేపర్ లేదా పాలిథిన్ షీట్‌పై కొద్దిగా నెయ్యి రాసి, దానిపై కాజూ మిశ్రమాన్ని పెట్టాలి. చేతులతో లేదా బటర్ పేపర్ సహాయంతో సుమారు రెండు నిమిషాల పాటు పిండిలా మెల్లగా కలుపుతూ మెత్తగా చేయాలి. ఈ ప్రక్రియ వల్ల కాజూ కట్లీ మరింత స్మూత్‌గా, సాఫ్ట్‌గా తయారవుతుంది. ఇప్పుడు రోలింగ్ పిన్‌కు కొద్దిగా నెయ్యి రాసి, కాజూ ముద్దను రెండు బటర్ పేపర్ల మధ్య ఉంచి సమానంగా, కొద్దిగా మందంగా ఉండేలా చపాతీ మాదిరిగా ఒత్తి రుద్దాలి. కావాలనుకుంటే పైన వెండి వర్క్ వేసుకోవచ్చు. ఇప్పుడు కాజూ కట్లీని సుమారు 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఆ తర్వాత కత్తి లేదా పిజ్జా కట్టర్‌తో డైమండ్ ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అంతే.. ఇంట్లోనే తయారు చేసిన మెత్తగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయే కాజూ కట్లీ సిద్ధం. రక్షాబంధన్‌తో పాటు ఇతర పండుగల సమయంలోనూ ఈ స్వీట్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకుని కుటుంబ సభ్యులకు అందించవచ్చు.
తాజావార్తలు
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!