Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి!
- సోషల్ మీడియాలో వైరల్
- మీడియాలోనూ కథనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్, పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ త్వరలో యూరప్‌కు చెందిన రాజకుటుంబ సభ్యురాలిని వివాహం చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను పీపీపీ నేత, కరాచీ మేయర్ ముర్తజా వహాబ్ ఖండించారు. బిలావల్ నిశ్చితార్థం, వివాహానికి సంబంధించిన వార్తలు “తప్పుడు, నిరాధారమైనవి” అని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా ప్రచారం
బిలావల్ భుట్టో జర్దారీ వయసు 38 సంవత్సరాలు. ఆయన పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కుమారుడు. ఇటీవల ఆయన వివాహానికి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. ఆసిఫ్ అలీ జర్దారీ తన కుమారుడి వివాహం గురించి చర్చించేందుకు, తేదీ ఖరారు చేసేందుకు స్విట్జర్లాండ్, ఆస్ట్రియా మధ్య ఉన్న చిన్న యూరోపియన్ దేశమైన లిక్టెన్స్టెయిన్కు వెళ్లినట్లు కొన్ని సోషల్ మీడియా పోస్టులు పేర్కొన్నాయి. ఈ ప్రచారానికి మరింత ఆసక్తికరమైన అంశాన్ని జోడిస్తూ.. బిలావల్ వివాహం చేసుకోబోయే యువతి 26 ఏళ్ల మాజీ ఆస్ట్రియన్ ఆర్చ్‌డచెస్ గ్లోరియా వాన్ హ్యాబ్స్‌బర్గ్ అని కొన్ని కథనాలు పేర్కొన్నాయి.
Also Read
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
యువరాణి ఎవరంటే?
గ్లోరియా వాన్ హ్యాబ్స్‌బర్గ్.. ఆస్ట్రియా ఆర్చ్‌డ్యూక్ కార్ల్, ఫ్రాన్సెస్కా వాన్ థైసెన్-బోర్నెమిస్జా కుమార్తె. ఆమె హ్యాబ్స్‌బర్గ్-లోరైన్ రాజవంశానికి చెందినవారు. ఆస్ట్రియా చివరి చక్రవర్తి, హంగేరీ చివరి రాజు అయిన కార్ల్-1కి ఆమె మునిమనవరాలు. అయితే బిలావల్‌తో ఆమె వివాహం జరగబోతోందంటూ వచ్చిన వార్తలకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు.
PPP నేత ఏమన్నారు?
ఈ ప్రచారంపై కరాచీ మేయర్, PPP నేత ముర్తజా వహాబ్ స్పందించారు. శనివారం అర్ధరాత్రి ‘ఎక్స్’ వేదికగా ఆయన బిలావల్ నిశ్చితార్థం, వివాహానికి సంబంధించిన వార్తలు “తప్పుడు, నిరాధారమైనవి” అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. పాకిస్థాన్‌కు చెందిన ఉర్దూ దినపత్రిక డైలీ ఔసాఫ్ కూడా బిలావల్ వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఓ కథనాన్ని ప్రచురించింది. గుర్తుతెలియని వర్గాలను ఉటంకిస్తూ ఆసిఫ్ అలీ జర్దారీ ఈ వ్యవహారానికి సంబంధించి ప్రైవేట్ యూరప్ పర్యటనలో ఉన్నారని పేర్కొంది. అయితే ఆ కథనం అనంతరం తొలగించారు.
జర్దారీ యూరప్ పర్యటనపై స్పష్టత
ఆగస్టు 27న పాకిస్థాన్ అధ్యక్ష భవన్ ‘ఎక్స్’లో ఓ ప్రకటన విడుదల చేసింది. ఆసిఫ్ అలీ జర్దారీ “ప్రైవేట్ పర్యటన కోసం విదేశాలకు వెళ్లారు” అని అందులో పేర్కొంది. అయితే ఆయన పర్యటన ఉద్దేశం గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇప్పటివరకు బిలావల్ భుట్టో లేదా ఆయన కుటుంబ సభ్యులు ఈ వివాహ ప్రచారంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలకు ఎలాంటి ఆధారాలు లేవని PPP నేత స్పష్టం చేశారు.
Bilawal Bhutto getting married to an Austrian? Vah! pic.twitter.com/Ni1DMJ3sv6
— Smita Prakash (@smitaprakash) August 30, 2026
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!