KTR : తెలంగాణలో పేదల ఇళ్లపై, పోడు భూములపై బుల్డోజర్ల దాడులు కొనసాగుతున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్‌లోని పేదల ఇండ్లు కూల్చడం తర్వాత, ఇప్పుడు ఆదివాసీల పోడు భూములపైనా దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ట్విటర్ వేదికగా స్పందించిన కేటీఆర్, “పేదలపైనా, అడవులపైనా ఇప్పుడు బుల్డోజర్లు దాడి చేస్తున్నాయి. పోడు భూముల్లో వ్యవసాయం చేసి జీవిస్తున్న ఆదివాసీలపై పోలీసులు దాడి చేయడం అమానుషం” అని పేర్కొన్నారు. ప్రభుత్వానికి పేదల పట్ల మానవత్వం…
Minister Seethakka : తెలంగాణ-ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ‘ఆపరేషన్ కగార్’పై కేంద్ర ప్రభుత్వం తన పట్టును కొనసాగిస్తూ, 20వేల మంది భద్రతా సిబ్బందితో కర్రిగుట్టల్లో మావోయిస్టు అగ్రనేతలు, దళ సభ్యులను పట్టుకునేందుకు గట్టి పోరాటం చేస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా, సీఆర్‌పీఎఫ్ (CRPF) దళాలు బుధవారం కర్రిగుట్టపై జాతీయ జెండా ఎగురవేశారు. ఈ చర్య చర్చనీయాంశంగా మారింది. అయితే, అక్కడ పర్మినెంట్ బేస్ క్యాంపుల ఏర్పాటు కోసం భద్రతా దళాలు సన్నాహాలు…
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఆదివాసీల ప్రయోజనాల దృష్టిలో ఆపరేషన్ కగార్ ను తక్షణం నిలిపివేయాలి అని డిమాండ్ చేశారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యం గా ఉండాలి.. తెలంగాణ- ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొనాలి అన్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిత్యం బిజీగా వుంటారు. అటు పాలనా వ్యవహారాల్లో బిజీగా వున్నా.. వివిధ సామాజిక సేవాకార్యక్రమాల్లో పాల్గొంటూ వుంటారు. స్వతహాగా డాక్టర్ అయిన తమిళిసై ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవాలంటారు. నల్లమలలో పర్యటించిన గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అక్కడి గిరిజనులతో మమేకం అయ్యారు. వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈరోజు మరిచిపోలేను, ఎప్పటికీ మరిచిపోను అన్నారు. గిరిజనులు, ఆదివాసీలకు సేవ చేయడం సంతోషంగా…