ధనుష్ హీరోగా నటించిన కుబేర జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై యునానిమస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్ బుకింగ్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ముఖ్యంగా ధనుష్ నటనప్రతి ఒక్కరిని మెప్పించింది. బిచ్చగట్టిగా ధనుష్ అద్భుతంగా చేసాడని ఫ్యాన్స్ నుండి స్టార్ హీరోల వరకు ధనుష్ ను ప్రశంసిస్తున్నారు. కాగా గత రాత్రి జరిగిన కుబేర సక్సెస్ మీట్ లో మెగా స్టార్ చిరు సైతం ధనుష్ ను పొగడ్తలతో ముంచెత్తారు.
Also Read : AK 64 : అజిత్ నెక్ట్స్ సినిమా.. మైత్రీ ఔట్.. వేల్స్ ఇన్
కుబేర సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. దేవ క్యారెక్టర్ లో ధనుస్ ని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేం. ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత అలా అనిపించింది. సినిమా చూస్తున్నప్పుడు ధనుష్ ని గుర్తించలేకపోయాను. అంతలా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయారు. ఈ సినిమాని ఒక సినిమాలా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ లా చూశాను. వాస్తవంగా జరుగుతున్నట్టుగా అనిపించింది. ఈ సినిమాలో హృదయానికి హత్తుకుపోయిన క్యారెక్టర్ దేవ. ఈ క్యారెక్టర్ కి ధనుష్ తప్ప ఇంకెవరూ చేయలేరు .అంత స్టార్ ఇమేజ్ ఉండి ఇలాంటి క్యారెక్టర్ చేయగలిగే యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ఇండియాలో ధనుష్ ఒక్కరే. అంత నేచురల్ గా క్యారెక్టర్ లో ఇమిడిపోయారు. ఈ సినిమాతో తనకి బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలి. తనకు అడ్వాన్స్ కంగ్రాజులేషన్స్ చెప్తున్నాను. ఆయనకు రాకపోతే అసలు నేషనల్ అవార్డు అనేదానికి అర్థమే లేదు. తనకి ఈ సినిమాకి అవార్డు వస్తే కనుక ప్రతి ఒక్కరికి గర్వకారణం’ అని అన్నారు.