KTR : తెలంగాణలో పేదల ఇళ్లపై, పోడు భూములపై బుల్డోజర్ల దాడులు కొనసాగుతున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్‌లోని పేదల ఇండ్లు కూల్చడం తర్వాత, ఇప్పుడు ఆదివాసీల పోడు భూములపైనా దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ట్విటర్ వేదికగా స్పందించిన కేటీఆర్, “పేదలపైనా, అడవులపైనా ఇప్పుడు బుల్డోజర్లు దాడి చేస్తున్నాయి. పోడు భూముల్లో వ్యవసాయం చేసి జీవిస్తున్న ఆదివాసీలపై పోలీసులు దాడి చేయడం అమానుషం” అని పేర్కొన్నారు. ప్రభుత్వానికి పేదల పట్ల మానవత్వం…
అయోధ్య అత్యాచారం కేసులో నిందితుడైన సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు మొయీద్ ఖాన్ మల్టీ కాంప్లెక్స్‌పై బుల్డోజర్ చర్య ప్రారంభమైంది. ఈ కాంప్లెక్స్‌లో నడుస్తున్న బ్యాంక్ ను ఇంకో చోటుకు మార్చే వరకు అధికారులు వేచి ఉన్నారు.
సైబరాబాద్ పరిధిలో ల్యాండ్ కబ్జాలకు పాల్పడుతున్న భూ కబ్జాదారులపై బుల్డోజర్స్తో పోలీసులు యాక్షన్లోకి దిగారు. మొదటిసారి అక్రమార్కులపై బుల్డోజర్స్ అస్త్రాన్ని ప్రయోగించారు. గండిపేటలో ఓ డాక్టర్ స్థలంను కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడ్డారు కబ్జాదారులు. ఈ స్థల వివాదంలో ఎమ్మార్పీఎస్ నేత నరేందర్ తో పాటు మరొకరిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన ఎమ్మార్పీఎస్ నేతను శంషాబాద్ లోని ఫామ్ హౌస్ లో పెట్టి హింసించారు. అంతేకాకుండా.. 20 కుక్కలు, పొట్టేళ్ల మధ్యలో నరేందర్ను చిత్రహింసలకు గురిచేశారు…
న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం టీ20 ప్రపంచ కప్ 2024 వేదికగా ఎనిమిది మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. న్యూయార్క్ లో క్రికెట్ స్టేడియం లేకపోవడంతో తాత్కలికంగా దీన్ని ఏర్పాటు చేశారు. 250 కోట్ల రూపాయలతో నిర్మించిన నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం.. అందరూ ఊహించినట్లుగానే ఇక్కడి పిచ్ బ్యాటర్లుకు పెద్దగా సహకరించలేదు. అయితే.. ఈ స్టేడియంలో బుధవారం జరిగిన ఇండియా-అమెరికా మ్యాచ్ చివరిది. ఆ తర్వాత ఈ స్టేడియాన్ని కూల్చివేయనున్నారు. స్టేడియంను కూల్చివేయడానికి…
అక్రమంగా నిర్మించిన స్టూడియోలపై ముంబై మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపించారు. ముంబైలోని మలాడ్ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన డజన్ల కొద్దీ ఫిల్మ్ స్టూడియోలను కూల్చివేసేందుకు బుల్డోజర్లు ప్రవేశించాయి. వీటిని మహా వికాస్ అఘాడి ప్రభుత్వ రక్షణలో నిర్మించారని బిజెపి ఆరోపించింది.