ఏడేళ్లలో అందరికీ ఎంతో మేలు జరిగింది… మంత్రి కొప్పుల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజూరాబాద్ ఎన్నికల్లో వేడి పెరుగుతూనే వుంది. జమ్మికుంటలో మహిళల సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్కు ఎందుకు ఓటువేయాలో ఓటర్లకు వివరించే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కు, టిఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు ఉందని, ఏడేళ్లలో ఏ యే వర్గానికి ఎంత మేలు జరిగిందో మీకు తెలుసు అన్నారు.
ప్రజలెదుర్కొంటున్న తక్షణ సమస్యలను కెసిఆర్ గుర్తించి పరిష్కరించారని..తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. తెలంగాణ అంతటా స్వచ్ఛమయిన నీరు లభిస్తోందన్నారు కొప్పుల ఈశ్వర్. బోరు నీళ్లు,సుద్ధ నీళ్లు, ఫ్లోరైడ్ నీళ్లు ఎక్కడా లేవు. స్వచ్ఛమైన గోదావరి నీళ్లు, పరిశుద్ధమైన తాగు నీళ్లు అందుతున్నాయి. 46వేల చెరువుల మరమ్మత్తులు జరిగాయి.
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
- CM Revanth Reddy : మూసీ, మెట్రోపై రగడ.. కిషన్ రెడ్డిని టార్గెట్ చేసిన సీఎం
కాళేశ్వరం ద్వారా సాగు నీరందుతోంది. సకాలంలో పుష్కలంగా కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు పెరిగాయి. ఇక మహిళల సంక్షేమం గురించి చెప్పాలంటే..లక్ష మంది ఒంటరి మహిళలను గుర్తించి పింఛన్లు అందిస్తున్నం.బీడీ కార్మికులను గుర్తించి పింఛన్లు ఇస్తున్నామన్నారు. దేశంలో చాలా మంది ఉన్నరు,కానీ ఒక మన రాష్ట్రంలోనే 7లక్షల మంది బీడి కార్మికులకు పింఛన్లు ఇస్తున్నాం.
కాన్పులకు ఖర్చు లేకుండా, ఇబ్బందులు పడకుండా ప్రభుత్వాసుపత్రుల్లో జరుగుతున్నయ్. నూటికి 70 శాతం ఆపరేషన్లు చేసి కాన్పులు జరిగేవి, ఇప్పుడు కెసిఆర్ కిట్,అమ్మ ఒడి పథకాల ద్వారా ప్రభుత్వం ఆదుకుంటున్నది. ఆడబిడ్డ పుడితే 13వేలు,మగ పిల్లగాడు పుడితే 12వేలు ఇస్తున్నం. చేప పిల్లల్ని ఉచితంగా అందిస్తూ ముదిరాజులు,గంగపుత్రులకు చేతినిండా పని కల్పిస్తున్నం అన్నారు. ప్రజలకు ఇన్నిరకాల మేలు జరుగుతున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు మంత్రి. అందరికీ అన్నీ ఇచ్చేది టీఆర్ఎస్ అయితే.. గుంజుకునే,తీసుకునే పార్టీ బిజెపి అని దుయ్యబట్టారు.
2వేల పింఛన్లు ఒక తెలంగాణలో మాత్రమే ఇస్తున్నం. బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎక్కడా కూడా ఇవ్వడం లేదు. మీరంతా మంచి మనసు ఉన్న వాళ్లు,సేవా దృక్పథంతో ముందుకు పోతున్నరు. గెల్లు శ్రీనివాస్ మంచి వాడు,ఓట్లు వేయండి,మరిన్ని వేయించండి. మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. మీకు ప్రభుత్వం నుంచి తప్పక సహాయ సహకారాలు అందుతాయని హామీ ఇచ్చారు కొప్పుల.
తాజావార్తలు
-
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్‌లో స్కిన్ షో చేస్తే బూతులు?
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!