హుజూరాబాద్ ఎన్నికల్లో వేడి పెరుగుతూనే వుంది. జమ్మికుంటలో మహిళల సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటువేయాలో ఓటర్లకు వివరించే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కు, టిఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు ఉందని, ఏడేళ్లలో ఏ యే వర్గానికి ఎంత మేలు జరిగిందో మీకు తెలుసు అన్నారు. ప్రజలెదుర్కొంటున్న తక్షణ సమస్యలను కెసిఆర్ గుర్తించి పరిష్కరించారని..తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. తెలంగాణ అంతటా స్వచ్ఛమయిన…