Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. ‘బాండెడ్ క్రైట్’గా గుర్తించిన అటవీ అధికారులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం ఆంకోనిగూడెం గ్రామంలోని అశోక్ నగర్లో అరుదైన పాము జనాల కంట పడింది. దాంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. నలుపు, పసుపు రంగు చారలతో కనిపించిన ఈ పామును చూసిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పామును పరిశీలించారు. పాము ఆకారం, శరీరంపై ఉన్న నలుపు–పసుపు చారలను పరిశీలించిన అధికారులు.. బాండెడ్ క్రైట్ (కట్టువిరియన్)గా గుర్తించారు. పాము సుమారు ఐదు అడుగుల పొడవు ఉన్నట్లు తెలిపారు.
బాండెడ్ క్రైట్ విషపూరితమైన పాము అని అటవీ అధికారులు వెల్లడించారు. సాధారణంగా ఈ జాతి పాములు మహారాష్ట్ర ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయని, రాత్రి వేళల్లో ఎక్కువగా సంచరిస్తాయని తెలిపారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, మరిన్ని పాములు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దానిని చంపేందుకు లేదా పట్టుకునేందుకు ప్రయత్నించకుండా అటవీ శాఖకు సమాచారం అందించాలని సూచించారు.
Also Read
- Majji Srinivasa Rao: వైసీపీకి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు రాజీనామా
- Mojtaba Khamenei: ఇజ్రాయిల్ ఎంబసీ పక్కనే ఇరాన్ సుప్రీంలీడర్ ఫ్లాట్లు..? స్పందించిన ఇరాన్..
- Supreme Court: టెట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో ముందు సవాలు.. కోలుకోవడానికి దశాబ్దం పట్టే ఛాన్స్
సాధారణంగా కనిపించే ప్రాంతానికి భిన్నంగా అశోక్ నగర్లో బాండెడ్ క్రైట్ దర్శనమివ్వడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. అటవీ సిబ్బంది పామును సురక్షితంగా పట్టుకుని, అనంతరం పాకాల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వన్యప్రాణులు, పాములు జనావాసాల్లోకి వచ్చినప్పుడు వాటిని చంపకుండా అటవీ శాఖకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. అశోక్ నగర్ ప్రాంతంలో ఈ అరుదైన పాము కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Malavika Mohanan: డూప్ వద్దు.. నేనే దూకేస్తా.. ‘సర్దార్ 2’ సెట్స్‌లో మాళవిక సాహసం!
-
Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫుల్ స్పీడ్‌లో ‘ఫౌజీ’ పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్!
-
Majji Srinivasa Rao: వైసీపీకి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు రాజీనామా
-
Mojtaba Khamenei: ఇజ్రాయిల్ ఎంబసీ పక్కనే ఇరాన్ సుప్రీంలీడర్ ఫ్లాట్లు..? స్పందించిన ఇరాన్..
-
Supreme Court: టెట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!