HCU Drugs: హెచ్‌సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో గంజాయి (డ్రగ్స్) వ్యవహారం కలకలం రేపింది. యూనివర్సిటీ ప్రాంగణంలో ఈగల్ టీమ్ సిబ్బంది నిర్వహించిన తనిఖీల్లో పలువురు విద్యార్థులు డ్రగ్స్ వినియోగించినట్లు గుర్తించారు. మొత్తం 17 మంది విద్యార్థులకు డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్‌గా తేలింది. డ్రగ్స్ విక్రయిస్తున్న హెచ్‌సీయూ పూర్వ విద్యార్థి అరెస్ట్ అయ్యాడు. అతడి వద్ద నుంచి 10 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈగల్ టీమ్‌కు అందిన సమాచారంతో హెచ్‌సీయూలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే హెచ్‌సీయూ పూర్వ విద్యార్థి అరెస్ట్ అయ్యాడు. డ్రగ్ టెస్టుల్లో 17 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది. వారి వద్ద నుంచి గంజాయి వినియోగానికి సంబంధించిన వివరాలను అధికారులు సేకరించారు. విద్యార్థులకు గంజాయి ఎలా చేరుతోంది, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనే అంశాలపై దర్యాప్తు చేపట్టారు. విచారణలో అస్సాం నుంచి గంజాయిని తీసుకొచ్చి యూనివర్సిటీ పరిసరాల్లో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
Also Read
- Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
- 100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
- CM Chandrababu: వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
- 8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
ఓ పెడ్లర్‌ను (హెచ్‌సీయూ పూర్వ విద్యార్థి) ఈగల్ టీమ్ విచారిస్తోంది. అతడికి గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తులు, నెట్‌వర్క్‌కు సంబంధించిన వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు. విద్యార్థుల్లో డ్రగ్స్ వినియోగం పెరగకుండా కట్టడి చేసేందుకు అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. హెచ్‌సీయూలో గంజాయి సరఫరా వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
-
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
-
Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
-
MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
ట్రెండింగ్
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!