Komatireddy Rajgopal Reddy : హరీష్, కడియం లాగా.. మేము జీ హుజూర్ బ్యాచ్ కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. హరీష్, కడియం లాగా.. మేము జి హుజూర్ బ్యాచ్ కాదన్నారు. కడియం, హరీష్ లు మమ్మల్ని చిల్చాలను గుంటకాడ నక్కల్లా ఎదురుచూస్తున్నారని, మేము పదవుల కోసం కాదు.. ప్రజల కోసం ఉండేవాళ్ళమన్నారు. బీఆర్ఎస్ చీప్ పాలిటిక్స్ మానుకోవాలని ఆయన హితవు పలికారు. అంతేకాకుండా.. కేసీఆర్.. రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకునే భాధ్యత మా పై పడిందని ఆయన తెలిపారు.
Kumari Aunty: మొన్న అక్కడ.. ఇప్పుడు ఇక్కడ.. ఇక నెక్స్ట్ బిగ్ బాసే..?
Also Read
నల్గొండ సభ కోసం.. డబ్బులు పెట్టు జగదీశ్వర్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటున్నారని, ఆ సభకు ప్రజలు రారు.. కార్యకర్తలు మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు రాజగోపాల్ రెడ్డి. బీఆర్ఎస్ ను ఇంటి బాట పట్టినందుకా కేసీఆర్ పోరుబాట.? అని ఆయన హెద్దెవా చేశారు. కేటీఆర్ కు దమ్ముంటే పార్టీని నడుపమను అని ఆయన సవాల్ విసిరారు. హరీష్‌ను మా పార్టీలోకి రమ్మంటున్నామని ఆయన వ్యాఖ్యానించారు. హరీష్ కష్టపడతారు.. అక్కడ భవిష్యత్ లేదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. హరీష్.. రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని, 26 మందిని తీసుకువస్తే… హరీష్ కు దేవాదాయ శాఖ ఇస్తాం.. చేసిన పాపాలు కడుక్కోవచ్చు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ సభ.. అట్టర్ ప్లాప్ అవుతుందని, బీఆర్ఎస్ ను పజలు అసహ్యించుకుంటున్నా రని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!