మునుగోడులో ఉప ఎన్నికలు వస్తాయో.. రావో.. నిర్ణయించేందుకు ఆ ప్రాంత ప్రజలే.. కానీ, మునుగోడుతో తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్ ముడిపడి ఉందన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఆయన బీజేపీలో చేరడం ఖాయమైన తరుణంలో.. ఆపేందుకు కాంగ్రెస్ నేతలు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు.. కానీ, రాజగోపాల్‌రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గినట్టు కనిపించడంలేదు.. ఇవాళ దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేయడం.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి.. ఆయనతో సమావేశమై రాహుల్ గాంధీ పంపిన సందేశాన్ని చేరవేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. రాబోయే రోజుల్లో యుద్ధం ప్రకటిస్తా అన్నారు.. ఇది పార్టీలకు సంబంధించిన యుద్ధం కాదు.. కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు జరిగే చివరి యుద్ధంగా పేర్కొన్నారు. ఇది ధర్మ యుద్ధం.. మునుగోడు ప్రజలతో మాట్లాడతా.. ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడే యుద్ధం అవుతుందన్నారు.. ప్రజాస్వామ్య నెలకొనాలంటే మునుగోడు తీర్పు తెలంగాణ ప్రజల మార్పు అవుతుందని అభివర్ణించారు.
Read Also: Merugu Nagarjuna: రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రికి గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
అసెంబ్లీ సాక్షిగా ప్రతి సమస్య పై నేను మాట్లాడాను అని గుర్తుచేశారు రాజగోపాల్‌రెడ్డి.. అభివృద్ధి అంటే గజ్వేల్ సిరిసిల్ల, సిద్ధిపేట అనే విధంగా చేశారని విమర్శించిన ఆయన.. నేను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాని కలిసిన తర్వాత రాజీనామా అంశం చర్చించకపోయినా.. పార్టీ మరతా అని చెప్పకపోయినా.. ప్రచారం జరిగిందన్నారు.. అయితే, ఉపఎన్నిక సీఎం కేసీఆర్ అనుకుంటే రాదు.. మునుగోడు ప్రజలనుకుంటే వస్తుందన్నారు.. కేసీఆర్ ప్రభుత్వం దిగివచ్చి మునుగోడు అభివృద్ధికి నిధులు వస్తాయి అనుకుంటే ఉప ఎన్నిక వస్తుందని తెలిపారు. ఈ తీర్పు తెలంగాణ రాజకీయాలను మార్చివేస్తాయి.. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. ఈ ఉపఎన్నిక యుద్ధం ద్వారా తెలంగాణ ప్రజల భవిష్యత్తు ముడిపడి ఉందన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను నోరు మూయించిన ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు అని మండిపడ్డారు.. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ఎమ్మెల్యేల హక్కులను హరించారు.. రాబోయే 10 – 15 రోజుల్లో మునుగోడులో చర్చించిన యుద్ధం ప్రకటిస్తానని వెల్లడించారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.