KTR Vs Rajagopal Reddy: కేటీఆర్.. మంత్రి పొన్నం మాట్లాడుతుంటే కూర్చో అంటాడు..ఎంత అహంకారం.. కేటీఆర్ బుద్ధి మార్చుకో అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మారలేదన్నారు. కడియం మొన్న నేను మంత్రివి కావు కూర్చో అన్నాడు.. మంత్రి పదవి..మా పార్టీ చూసుకుంటారు.. అని తెలిపారు. ఉద్యమ కారుడు రాజయ్యకి అన్యాయం చేసింది నువ్వు అంటూ మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పదవి లాక్కున్నావన్నారు. అవమానకరంగా మంత్రి పదవి తీయించుకున్న చరిత్ర మీది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కావాలని.. ఎమ్మెల్యే వదిలేసి.. ఎమ్మెల్యే సీటు కోసం రాజయ్య కి అన్యాయం చేశావన్నారు. నాగురించి ముందు మాట్లాడింది కడియం శ్రీహరి అని మండిపడ్డారు. మా పార్టీ విషయాల గురించి వాళ్లకు ఏంది? అని ప్రశ్నించారు. అధికారం పోయిన తర్వాత మా పార్టీ ని చీల్చే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు పదవులు ముఖ్యమా… పదవులు నాకు ముఖ్యమా.. అని ప్రశ్నించారు. రాజీనామా చేసి మీ సర్కార్ ని ప్రజల కాళ్ల దగ్గరికి తీసుకు వచ్చామంటూ కేటీఆర్ పై మండిపడ్డారు.
Read also: Farmers Protest: మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగం.. 60 మంది రైతులకు గాయాలు!
స్పీకర్ గా మిమ్మల్ని గౌరవిస్తామని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. మేము మాట్లాడేది తప్పు అయితే.. మంత్రులు చెప్పొచ్చన్నారు. కానీ మంత్రులు దూషించి.. స్పీచ్ ఇస్తున్నారని మండిపడ్డారు. రాజగోపాల్ ..కడియం పై చేసిన వ్యాఖ్యలు తొలగించాలన్నారు. ట్రెజరీ బెంచ్ సబ్యులకు మైక్ ఇస్తున్నారు.. మాకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నం అంటే గౌరవం అన్నారు. కానీ వాస్తవానికి విరుద్ధ మాటలు చెప్పారు.. అందుకే అలా అన్నం అని తెలిపారు. గౌరవేల్లి డ్రై రన్ కాలేదా..? అని ప్రశ్నించారు. మేడిగడ్డ వెళ్లి మా పై బురద జల్లే పని చేస్తున్నారని అన్నారు. మంత్రిని అగౌరవ పరిచే ఉద్దేశం మాకు లేదన్నారు. కానీ ఆయన కూడా అబద్ధాలు చెప్పొద్దూ అంటూ మండిపడ్డారు. మేడిగడ్డ కుంగితే.. మేడిగడ్డ నింపండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మీద కోపం ఉంటే..రైతుల మీద పగ తీర్చుకోవద్దన్నారు.
Jai Hanuman : జై హనుమాన్ హీరోగా కెజిఎఫ్ యష్?.. డైరెక్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..