Telangana Assembly: కేసీఆర్ అనే పాము సచ్చింది అని.. సచ్చినా పామును మళ్ళీ చంపుతాడా ఎవడన్న అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సభకు రాకుండా పారిపోయి..కేసీఆర్ తప్పించుకుంటాడని తెలిపారు. మూడు రోజులగా సభలో అన్ని విషయాలు చర్చ చేయాలని అనుకున్నామన్నారు. చూసి వచ్చి చర్చ చేద్దాం అని..అందరం మేడిగడ్డ పోదాం అన్నాము.. పిలిస్తే వాళ్ళు రాలేదని రేవంత్ అన్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళదే తప్పు అన్నట్టు మట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నిన్న సభలో ఏం మాట్లాడారు ? అని ప్రశ్నించారు. బాషా మీద మాట్లాడదమా ? అన్నారు. ఎం పికనికి పోయారు అన్నాడు కేసీఆర్.. ఇప్పటికే నీ పాయింట్ ఉడపికారు ప్రజలు అంటూ చెప్పుకొచ్చారు రేవంత్.. చెప్పుకునే దిక్కు లేక బొక్కబోర్ల పడి కాళ్ళు ఇరిగాయన్నారు.
Read also: Delhi: రైతులను మరోసారి చర్చలకు పిలిచిన కేంద్ర ప్రభుత్వం..
సీఎం ని ఏం పికనికి పోయావు అంటారా? అని మండిపడ్డారు. ఇదేనా సంప్రదాయం అని ప్రశ్నించారు. మేడిగడ్డ నీళ్లు నింపే పరిస్థితి ఉందా..? హరీష్ కి పెత్తనం ఇస్తాం.. వాళ్లనే మేడిగడ్డ ఎట్లా నింపుతారో చేయమనండి అన్నారు. నీళ్లు నిలిచే పరిస్థితి లెకుండా ఉంటే.. ఇక్కడకు వచ్చి మళ్ళీ మాట్లాడతారా? అని మండిపడ్డారు. మేడిగడ్డ మీద చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. రమ్మను..సభకు..రేపు వరకు చర్చ చేద్దాం అన్నారు. జైలుకు పోవాల్సి వస్తుంది కేసీఆర్..అన్నారు. కేసీఆర్ అనే పాము సచ్చింది.. సచ్చినా పామును మళ్ళీ చంపుతాడా ఎవడన్న అన్నారు. సభకు రాకుండా పారిపోయి.. కేసీఆర్ తప్పించుకుంటున్నాడని తెలిపారు. ఈయన వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు అంటూ మండిపడ్డారు. కొత్త విషయం చెప్తున్నాడని అన్నారు. కాళేశ్వరం మీద అయినా.. మేడిగడ్డ మీద చర్చ చేయడానికైనా సిద్ధం మేము అని రేవంత్ అన్నారు.
IAS Officers Transferred: ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు..