బీజేపీ శిక్షణా తరగతులు హైదరాబాద్‌లోని శామీర్‌పేటలో గల రిసార్ట్‌లో జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణ తరగతులను తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ ప్రారంభించారు. అయితే మొదటి రోజు శిక్షణ తరగతుల కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మీ బ్రాండ్ మాకు అవసరం లేదు.. మాది భారత్ బ్రాండ్ అంటూ టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వెల్ నెస్ సెంటర్స్ ని బస్తీ దవాఖానాలుగా మార్చి నడిపిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం… ప్రజలకు ప్రభుత్వంకి మధ్య దళారి వ్యవస్థ లేకుండా చేస్తుందని, దళిత బంధు లాంటి పథకాలు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నవాళ్లకే ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా..కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల్లో ఎక్కడైనా వివక్ష ఉందా ? అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Mamata Benerjee: డిసెంబర్ 5న ప్రధానితో మమత కీలక భేటీ.. ఆ అంశాలపై చర్చించే అవకాశం
ఓట్ల కోసం హిందూయిజాన్ని విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీకి ఏ మతం తక్కువ కాదని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థికశక్తిగా ఉన్న దేశంలో 5వ స్థానంలో ఉన్నామని ఆయన వెల్లడించారు. ఆర్థిక రంగంలో బ్రిటన్ ను కూడా వెనక్కి నెట్టేశామని, పాకిస్థాన్ వెళ్లి సీఎం కేసీఆర్ ఆరు నెలలు ఉండి వస్తే అక్కడ పరిస్థితి తెలుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఫాం హౌస్ ఫైల్స్ కు బీజేపీ భయపడదని, అందులో కొండను తవ్వి తొండను కూడా పట్టలేరని ఆయన విమర్శించారు. అందులో ఏముందో అర్థం కావడం లేదని, గుమ్మడి కాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు… సీబీఐపై నిషేదం పెట్టారంటూ ఆయన ధ్వజమెత్తారు.
Also Read : Kishan Reddy : బీజేపీలో ఎవరు పార్టీ అధ్యక్షుడు అవుతారో, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో చెప్పలేము