బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఈరోజు హైదరాబాద్ రానున్నారు. రేపు ఎల్లుండి సమీర్‌పేటలో నిర్వహించే దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ నియోజకవర్గాల కార్యకర్తల శిక్షణ శిబిరంలో పాల్గొంటారు. అసెంబ్లీ విస్తారకులు, తెలంగాణ ఇన్‌ఛార్జ్‌లతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
ఇవాళ్టి నుంచి మూడురోజుల పాటు బీజేపీ రాష్ట్ర ముఖ్య నాయకులు శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇవాళ మధ్యాహ్నం శామీర్‌పేటలోని లియోనియా రిసార్ట్స్‌లో ఈ శిబిరాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్‌చుగ్ ప్రారంభిస్తారు.