IND vs AFG Schedule: భారత్, అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ ఖరారు.. పూర్తి షెడ్యూల్ ఇదే.. బంగ్లాదేశ్‌కు భారీ షాక్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AFG 2026 Schedule: భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు షెడ్యూల్ ఖరారు అయింది. సెప్టెంబర్‌లో భారత పర్యటనకు టీమిండియా రానున్నట్లు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) ధ్రువీకరించింది. సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు టీ20 సిరీస్ జరగనుంది. మూడు మ్యాచ్‌లూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరగనున్నాయి. భారత పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను తమ వాణిజ్య భాగస్వాములు, సంబంధిత సంస్థలకు ఏసీబీ లేఖ ద్వారా తెలియజేసింది.
భారత్, అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ సెప్టెంబర్ 13న జరగనుంది. రెండో టీ20 సెప్టెంబర్ 15న, మూడో టీ20 సెప్టెంబర్ 17న జరగనుంది. మూడు మ్యాచ్‌లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియమే వేదిక కానుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన తేదీలు, వేదికలను బీసీసీఐతో చర్చించి ఖరారు చేసినట్లు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు సిరీస్ జరగనున్నట్లు ఏసీబీ సీఈఓ నసీబ్ ఖాన్ ధ్రువీకరించారు. బీసీసీఐతో తేదీలు, వేదికలపై అంగీకారం కుదిరిందని కూడా వెల్లడించారు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
అయితే ఈ సిరీస్‌పై అభిమానులకు అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉందని ఏసీబీ స్పష్టం చేసింది. మీడియా హక్కుల సంస్థలు, ఇతర భాగస్వాములు ముందస్తు ఏర్పాట్లు చేసుకునేందుకు షెడ్యూల్‌ను అధికారికంగా తెలియజేసినట్లు పేర్కొంది. ఈ సిరీస్‌లో మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. విదేశీ క్రికెట్ బోర్డు భారత్‌లోనే టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. సాధారణంగా భారత జట్టు స్వదేశంలో ఆడే సిరీస్‌లను బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటుంది. అయితే ఈసారి అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ సిరీస్‌కు ఆతిథ్య బాధ్యతలు తీసుకుంది.
అఫ్గానిస్థాన్‌తో సిరీస్ ఖరారు కావడంతో సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ సిరీస్ జరిగే అవకాశాలు పూర్తిగా తగ్గినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి 13 వరకు భారత్‌తో ఆరు మ్యాచ్‌ల వైట్‌బాల్ సిరీస్ నిర్వహించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భావించినట్లు సమాచారం. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆ సిరీస్‌పై అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం భారత్-అఫ్గానిస్థాన్ మూడు టీ20ల సిరీస్‌కు తేదీలు, వేదికలు ఖరారయ్యాయి. సెప్టెంబర్ 13న ఢిల్లీలో తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుండటంతో.. ఇరు జట్ల అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత జట్ల వివరాలు, మ్యాచ్ సమయాలపై మరింత స్పష్టత రానుంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!