ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.. గత కొన్ని రోజుల కిందట విడుదల చేసిన నోటిఫికేషన్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తుంది.. ఈ క్రమంలో మరో నోటిఫికేషన్ ను అధికారులు విడుదల చేశారు..ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 496 ఖాళీలను భర్తీ చేయనున్నారు.. దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిర్ లైన్స్ సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు..
కాగా, ఈ ఉద్యోగాల కు దరఖాస్తు చేసుకొనే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఎస్సీ (ఫిజిక్స్/ మ్యాథ్స్) లేదా ఏదైనా విభాగం లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి 27 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది. సీబీటీ, వాయిస్ టెస్ట్, సైకోయాక్టివ్ సబ్‌స్టాన్స్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితర విధానాల ద్వారా అభ్యర్థులను ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి వేతనంగా రూ.40000 నుండి 140000 వరకు చెల్లిస్తారు.
ఈ ఉద్యోగాల కు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి.. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది 30.11.2023 గా నిర్ణయించారు. దరఖాస్తు ఫీజుగా రూ.1000. నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఫిమేల్ ఏఏఐలో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థుల కు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంటుంది.. ఇక ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు తెలుకోవాలనుకొనేవారు వెబ్ సైట్ ; https://www.aai.aero/ పరిశీలించగలరు..