Ponguleti: ఆట మొదలైంది ఇప్పుడు.. కబ్జాలన్నీ బయటకు తీస్తామని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 30 ఎల్లా పాటు ప్రజలకోసం పని చేశారని అన్నారు. బాలసాని గారిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించామన్నారు. రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో నేను సైతం అంటూ తాను వస్తా అన్నారు. వారికి స్వాగతం సుస్వాగతం అని తెలిపారు. గడచిన 9 ఏళ్లలో ప్రజలను మభ్యపెట్టారు కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఎన్ని లక్షల కోట్లు ఎన్నికల్లో ఖర్చు పెట్టినా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మూడెకరాల మోసం….డబుల్ బెదరూమ్ మోసం….దళిత ముఖ్యమంత్రి మోసం…..అన్ని మోశాలే….. అని మండిపడ్డారు. యువత మొత్తం మనవైపే చూస్తున్నారు. ఆఖరుకు TSPSC కూడా మోసమే అన్నారు. డబ్బు కోసం పేపర్లు లీకు చేసిన ఘనుడు కేసీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులకు కాకుండా పింక్ షర్ట్ వేసుకున్న వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఆరోపించారు.
నిరుద్యోగ యువత కలలు కల గానే మిగిలిపోయిందన్నారు. కేసీఆర్ అన్ని సెక్టార్ లలో మోసం చేసాడన్నారు. ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది. ఇళ్ల స్థలం తోపాటుగా 5 లక్షలతో ఇల్లు ఇస్తామన్నారు. గ్యారెంటీ కార్డుల గ్యారెంటీ కాంగ్రెస్ తీసుకుంటుందని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు కట్టింది మీ తాతా కేసీఆర్….? గోదావరి పై కట్టిన ప్రాజెక్ట్ లు మీ అయ్యా కట్టాడా? అని నిప్పులు చేరిగారు. ఉచిత కరెంట్ పేటెంట్ మీదా కేసీఆర్ .. ఆ పేటెంట్ YS రాజశేఖర్ రెడ్డి ది అన్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే అన్నారు. మీరేంటో కమ్యూనిష్టులకు ఇటీవలే తెలిసిందన్నారు. అరాచక పాలనకు కేరాఫ్ ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ అంటూ మండిపడ్డారు. ఆట మొదలైంది ఇపుడే.. కబ్జా లన్నీ బయటకు తీస్తామన్నారు. ప్రతీ గజాన్ని కొనుక్కున్న వారికి చెందేలా చేస్తామన్నారు. ఇందిరమ్మ పాలన కోసం అందరం కలిసి పని చేయాలని తెలిపారు.
Kalyan Ram Devil: ఈ మలయాళ హీరోయిన్ ని చాలా కొత్తగా చూపించారు…