kishan reddy: విశాఖ స్టీల్ ఫ్లాంట్ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గత వారం రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటామని సింగరేణి ఆధికారులను ఆఘమేఘాల మీద అక్కడికి పంపించి రాజకీయ డ్రామాకు తెరతీశారన్నారు. బీఆర్ఎస్ మంత్రులు అనేకమైన అడ్డగోలు ప్రకటనలు చేసారని విమర్శించారు. అవకాశం లేదని చెప్పినా రాజకీయ లబ్ధి కోసమే ఇలా చేస్తున్నారని అన్నారు. సాధ్యం కాదని తెలిసినా.. బయ్యారం స్టీల్ ప్లాంట్ ను రాష్ట్రమే ఏర్పాటు చేస్తుందని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సవాల్ విసిరారు. మూతపడిని అనేక పరిశ్రమల్ని వందరోజుల్లో తెరిపిస్తామన్న కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం స్టీల్ ఫ్లాంట్ పేరుతో కల్వకుంట్ల కుటుంబం అబద్దాలు ప్రచారం చేస్తూ గప్పాలు, ఫోజులు కొడుతోందని, బయ్యారం ఉక్కు పరిశ్రమపై బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఖమ్మం జిల్లా ప్రజలు తెలంగాణ సమాజం ప్రశ్నించాలని కిషన్ రెడ్డి కోరారు. తెలంగాణను గాలికొదిలేసి బీఆర్ఎస్ పేరుతో దేశాన్ని ఉద్దరిస్తాననటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రాని విమర్శించడమే బీఆర్ఎస్ ఎజెండాగా పెట్టుకుందని విమర్శించారు. వందరోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని, తొమ్మిదేళ్లు అవుతున్నా ఎందుకు ఓపెన్ చేయలేదని నిలదీశారు.
Read Also: Minister Jagadish Reddy: బండి సంజయ్ కోసం కాంగ్రెస్ పనిచేస్తోంది.. మంత్రి విమర్శలు..
తొమ్మిదేళ్లుగా అంబేద్కర్ జయంతి రోజున సీఎం కేసీఆర్ ఇంటి నుంచి బయటకు రాలేదని ఎద్దేవా చేశారు. ఇది రాజకీయ ఎత్తుగడ తప్పా..అంబేద్కర్ పై ప్రేమ కాదని విమర్శించారు. అంబేద్కర్ రాసిని రాజ్యాంగాన్ని రద్దు చేయాలని, కల్వకుంట్ల రాజ్యాంగం రావాలని ఆయన అనుకుంటున్నారని ఆరోపించారు. ఇఫ్తార్ విందుకు వెళ్లేందుకు సమయం ఉన్న కేసీఆర్ భద్రాచలం వెళ్లేందుకు సమయం ఉండదని అన్నారు. తెలంగాణను దోచుకున్నది చాలదన్నట్లుగా ఇప్పుడు బీఆర్ఎస్ అంటూ జాతీయ పార్టీ పెట్టారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతున్నా.. రాష్ట్రం సహకరించడం లేదని అన్నారు.
అతీక్ అహ్మద్ హత్యపై స్పందించిన కిషన్ రెడ్డి… ఓల్డ్ సిటీలో అనేెక బస్తీల నుంచి ఆస్తులు అమ్ముకుని ప్రజలు కట్టుబట్టలతో వెళ్తున్నారని దానికి కారణం ఎవరో అలాంటి వాటిపై అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడితే బాగుంటుందని అన్నారు. హత్య జరిగిన వెంటనే కమిటీ వేశానమని, వందల కేసులు ఉన్న వ్యక్తి చనిపోయాడని, అలా జరగాల్సింది కాదని, కానీ జరిగిందని అన్నారు. మాఫియాపై జీరో టాలరెన్స్ తో వ్యవహరిస్తానమి అన్నారు.