Pushpa 2 Likely to Postpone from August 15th: స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ కి పుష్ప ఊహించిన విజయాన్ని తీసుకొచ్చింది. ఈ సినిమా దెబ్బకు ఆయన ఐకాన్ స్టార్ గా అవతరించడమే కాదు నార్త్ లో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రెండో భాగం మీద భారీ అంచనాలు ఉండడంతో స్వయంగా తానే నిర్మిస్తూ మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి సినిమాను ఒక రకంగా చెక్కుతున్నాడు. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సింది కానీ వాయిదా పడుతూ వచ్చింది. చివరిగా ఆగస్టు 15వ తేదీ రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆ రోజు కూడా సినిమా రిలీజ్ అవ్వడం కష్టమే అనే వార్తలు ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అల్లు అర్జున్ సహా నిర్మాతలు సినిమాని ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన డేట్ కి రిలీజ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
Borugadda Anil: పవన్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు.. బోరుగడ్డ ఆఫీస్ దగ్ధం!
అందుకు అనుగుణంగానే అల్లు అర్జున్ జూన్ రెండో వారానికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టుకున్నాడు. కానీ అనుకోని కారణాలతో షూట్ మరో నెల రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే సుకుమార్ అలాగే ఆయన టీం కొన్ని సీన్స్ కరెక్ట్ గా రాలేదని భావిస్తూ వాటిని రీడ్ డిజైన్ చేసి రీ షూట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ మధ్యనే ఫహద్ ఫాజిల్ డేట్ ఇవ్వడంతో ఆయనకి సంబంధించిన సీక్వెన్స్ షూటింగ్ చేస్తున్నారు. దానికి తోడు ఇప్పటివరకు ఎడిటర్ గా వ్యవహరించిన కార్తీక శ్రీనివాస్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ నూలి పని మొదలు పెట్టాడు. ఇక ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ వచ్చే నెల చివరి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
దాన్ని బట్టి చూస్తే పుష్ప టు సినిమాని ఆగస్టు 15వ తేదీకి తీసుకురావడం అయితే అసాధ్యం అనే చెబుతున్నారు. అయితే హీరో సహా నిర్మాతలు సుకుమార్ మీద ప్రెజర్ పెడుతున్నారు. కానీ ఆయన మాత్రం క్వాలిటీ అవుట్ ఫుట్ వస్తేనే రిలీజ్ చేద్దామని లేకపోతే రిలీజ్ డేట్ వెనక్కి చూద్దాం అని చెప్పేస్తున్నారట. ఒకవేళ నిజంగానే రిలీజ్ డేట్ వెనక్కి వాయిదా వేస్తే మాత్రం ఇప్పటివరకు బెనిఫిట్ అని భావిస్తూ వస్తున్న నేషనల్ హాలిడే వృధా అయిపోతుందనే చెప్పాలి. ఆ డేటు వదులుకోవడం వల్ల కలెక్షన్స్ లో దాదాపు 30 కోట్ల రూపాయలు తేడా కూడా కనిపించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుందనేది.