Borugadda Anil Office Burnt at Guntur: గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా ఆయన కుటుంబ సభ్యులు, కుమార్తెల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తికి చెందిన ఆఫీసు దగ్ధమైంది. గతంలో అనిల్ కుమార్ కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ కార్యదర్శి లోకేష్ సహా వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడే అందరి మీద బూతులతో విరుచుకుపడుతూ ఉండేవారు. తనకు తాను రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గా చెప్పుకునే బోరుగడ్డ అనిల్ కుమార్ మాజీ సీఎం వైఎస్ జగన్ తనకు బంధువు అని కూడా చెప్పుకుంటూ ఉండేవారు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వారి మీద బూతులతో విరుచుకుపడుతూ ఉండేవారు.
Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠికి గాయం.. ఏమైందంటే?
గతంలో ఎన్నికలకు కొన్ని నెలల ముందు కూడా ఆయన ఆఫీస్ మీద దాడి జరిగి, తగల బెట్టారు. అయితే తాజాగా గుంటూరు నగరంలో ఉన్న వల్లూరు వారి తోట ఆరో లైన్ లోని బోరుగడ్డ అనిల్ కుమార్ కార్యాలయానికి నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో క్షణాల వ్యవధిలో మంటలు ఎగిసిపడి ఆ కార్యాలయం పూర్తిగా దగ్ధమైనట్లుగా చెబుతున్నారు. గతంలో తగలబెట్టిన సమయంలో పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన జరిగినప్పటి నుంచి కార్యాలయంలో ఎలాంటి విలువైన సామాగ్రి ఉంచడం లేదని చెబుతున్నారు. ఇప్పుడు కార్యాలయాన్ని రెనోవేట్ చేస్తున్న నేపథ్యంలో లోపల సామాగ్రి అంతా బయట పెట్టారని, అయితే కొంత ఫర్నిచర్ మాత్రం లోపలే ఉందని చెబుతున్నారు.
నిన్న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బయటపెట్టిన ఫర్నిచర్ మీద పెట్రోల్ పోసి నిప్పంటించగా కార్యాలయం మొత్తం దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. గతంలో జగన్ తమ చేతులు కట్టేశారు. ఆయన గనుక ఒక్కసారి ఓకే అంటే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎవరిని చూడను అరగంటలో అందరినీ లేపేస్తానంటూ బోరుగడ్డ చేసిన వ్యాఖ్యలు ఆయనకు సోషల్ మీడియాలో గుర్తింపు తీసుకొచ్చాయి. అయితే నిప్పు అంటుకున్న ఘటన మీద పోలీసులకు సమాచారం అందించగా వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.