తెలంగాణ గడ్డపై నవ శకం మొదలైంది… తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీగా మారిపోయింది… జాతీయ రాజకీయాలే లక్ష్యంగా బీఆర్‌ఎస్ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన గులాబీ దళపతి కె.చంద్రశేఖర్‌రావు.. దానికి ఆమోదం పొందేలా చేశారు.. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ఆమోదం తెలిపింది.. దీంతో.. టీఆర్‌ఎస్ ఇప్పుడు బీఆర్‌ఎస్‌గా మారిపోయింది… టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్‌గా మారుస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు సీఎం కేసీఆర్… తెలంగాణ భవన్ వేదికగా జరిగిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో భారత్ రాష్ట్ర సమితిగా పేరు మారుస్తూ తీర్మానం పెట్టడం.. అది ఆమోదం పొందిన తర్వాత.. అధికారక ప్రకటన చేశారు గులాబీ పార్టీ బాస్… దీంతో.. తెలంగాణ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో కీలక మలుపు చోటు చేసుకుంది.. టీఆర్ఎస్ ప్రతినిధులతో పాటు.. పలు రాష్ట్రాల నేతల సమక్షంలో బీఆర్ఎస్ ప్రకటన చేశారు కేసీఆర్…
Read Also: Munugode by-election: మునుగోడు బరిలో గద్దర్.. ప్రజా యుద్ధనౌకకు కేఏ పాల్ అవకాశం..
జాతీయ పార్టీగా టీఆర్ఎస్ ను భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశం చేసిన తీర్మానాన్ని కేసీఆర్ చదివి వినిపించిన సందర్భంలో చప్పట్లు, నినాదాలతో సమావేశంలో మార్మోగింది.. దేశ్‌కి నేత కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు… బీఆర్ఎస్ జిందాబాద్ అంటూ నినదించారు.. కాగా, నేషనల్ హైవేపే కారును పరుగెత్తించాలని గతంలో కూడా ప్రయత్నించారు కేసీఆర్. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందే జాతీయ స్థాయిలో దళపతి ఆలోచనలో సాగాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావడంతో.. ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. కేంద్రం నుంచి తెలంగాణకు సరైన సహకారం అందడం లేదని.. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆరోపిస్తున్న కేసీఆర్. బీజేపీపై తీవ్రస్థాయి పోరాటానికి పిలుపు ఇచ్చారు. దేశానికి ప్రత్యామ్నాయ అజెండా కావాలని బలంగా కోరుకుంటున్న సీఎం కేసీఆర్.. కొద్దికాలంగా వివిధ పార్టీల నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. ప్రగతిభవన్‌కు వచ్చిన సీపీఐ, సీపీఎం ప్రధాన కార్యదర్శులతోపాటు.. పలు పార్టీల నాయకులు.. ఉత్తర భారతానికి చెందిన రైతులతో సుదీర్ఘ మంతనాలు చేశారు. అంతేకాదు.. వివిధ రాష్ట్రాలకు వెళ్లి అక్కడి నాయకులతో మాట్లాడి వచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షపార్టీల అభ్యర్థికే మద్దతు తెలిపి.. జాతీయ స్థాయిలో తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పారు కేసీఆర్.