Bandi Sanjay: బీజేపీ భిక్ష వల్లే కేసీఆర్ సీఎం అయ్యాడు.. బండి సంజయ్ ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR Became Chief Minister Because Of BJP Alms Says Bandi Sanjay: బీజేపీ భిక్ష వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ బిల్లు తీసుకొస్తే తెలంగాణ రాలేదని, సుష్మా స్వరాజ్ పార్లమెంట్‌లో పోరాడితే వచ్చిందని పేర్కొన్నారు. అయితే.. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడుందని ఆరోపించారు. తెలంగాణ తెచ్చింది, ప్రాణత్యాగం చేసింది ఒక్క కుటుంబం కోసమేనా? అని ప్రశ్నించారు. అమరుల త్యాగాలతో కేసీఆర్ కుటుంబం జల్సా చేస్తోందని వ్యాఖ్యానించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ బిడ్డ, కొడుకు అమెరికాలో చిప్పలు కడుగుతున్నారని విమర్శించారు. మహిళా మోర్చా అంటే కవిత గజగజ వణుకుతోందని అన్నారు. వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అని కొడితే కేసీఆర్ పేరు వస్తోందని.. గ్రేట్ లీడర్ అంటే మోడీ పేరు వస్తోందని చెప్పారు. కావాలంటే ఫోన్‌లో చెక్ చేసుకోవచ్చన్నారు. ఇది నేనో, ఇంకెవరో పెట్టింది కాదని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఒక మహిళ(కవితను ఉద్దేశిస్తూ) హస్తం ఉండటం వల్ల.. దేశంలోని మహిళల ప్రతిష్ట దిగజారిందన్నారు. జాతీయ రాజకీయాలు అని చెప్పి, బీఆర్ఎస్ పార్టీ పెట్టి, దాన్ని కవితకు అప్పగిస్తున్నాడని.. అది కూడా దేశాన్ని దోచుకోవడానికే అని ఆరోపణలు చేశారు.
V Hanumantha Rao: రేవంత్ రెడ్డిపై దాడిని ఖండించిన వీహెచ్.. సీరియస్ వార్నింగ్
Also Read
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
ఇదే సమయంలో మెడికో ప్రీతి మృతి వ్యవహారంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీతి నాయక్‌ది ముమ్మాటికీ హత్యేనని చెప్పారు. CMO డైరెక్షన్‌లోనే దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారన్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. యూపీలో మహిళలపై కన్నెత్తి చూస్తే.. అక్కడి సీఎం బుల్డోజర్‌లతో ఏమీ చేస్తున్నాడో, ఇక్కడ బీజేపీ అధికారంలోకి వస్తే అదే జరుగుతుందని తెలిపారు. మహిళలను మోడీ మంత్రులు, సీఎంలు, గవర్నర్‌లను చేశారని.. రాష్ట్రపతిగా కూడా మహిళను చేశారని చెప్పుకొచ్చారు.
Indian Shot Dead: ఆస్ట్రేలియాలో దారుణం.. పోలీసుల కాల్పుల్లో భారతీయుడు మృతి
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!