Indian Shot Dead: ఆస్ట్రేలియాలో దారుణం.. పోలీసుల కాల్పుల్లో భారతీయుడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian National Shot Dead In Australia After He Stabs Cleaner: ఆస్ట్రేలియాలో ఓ దారుణం చోటు చేసుకుంది. అక్కడి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ భారతీయుడు మృతిచెందాడు. అయితే.. అతడు ఓ క్లీనర్‌పై కత్తితో దాడి చేయడం వల్లే, పోలీసులకు మరో దారి లేక కాల్పులు జరపాల్సి వచ్చింది. మృతుడ్ని తమిళనాడుకు చెందిన మహ్మద్ రెహ్మత్తుల్లా సయ్యద్ అహ్మద్(32)గా గుర్తించారు. అసలేం జరిగిందంటే.. ఆస్ట్రేలియాలో బ్రిడ్జింగ్ వీసాపై నివసిస్తున్న అహ్మద్, సిడ్నీ రైల్వే స్టేషన్‌లో ఓ క్లీనర్‌పై కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్తుండగా.. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, మార్గమధ్యంలో అహ్మద్‌ను అడ్డుకున్నారు. అప్పుడు మళ్లీ అతడు పోలీసులపై ఎటాక్ చేయబోయాడు. దీంతో.. అహ్మద్‌పై పోలీసులు మూడు రౌండ్ల కాల్పులు జరిపగా, రెండు బుల్లెట్స్ అతడి ఛాతిలోకి దూసుకెళ్లాయి. అతడ్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు.. అహ్మద్ కత్తితో దాడి చేసిన క్లీనర్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది.
Cheteshwar Pujara: పుజారా చెత్త రికార్డ్.. గవాస్కర్ తర్వాత ఇతడే!
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
ఈ ఘటనపై సిడ్నీ ఏసీపీ స్మిత్ మాట్లాడుతూ.. సయ్యద్ అహ్మద్ గురించి తాము రికార్డులు తిరగేశామని, అతనిపై ఎలాంటి క్రిమినల్ రికార్డ్ లేదని స్పష్టం చేశారు. దీనిని తాము తీవ్రవాద దాడి పరిగణించడం లేదని క్లారిటీ ఇచ్చారు. తమ పోలీస్ అధికారులకు తాను మద్దతు ఇస్తానని, కత్తితో దాడి చేయబోయాడు కాబట్టి స్వీయరక్షణలో భాగంగా కాల్పులు జరిపారని, ఇది బాధాకరమైన ఘటన అని పేర్కొన్నారు. అహ్మద్, క్లీనర్ ఒకరికొకరు తెలియదని.. వీరి మధ్య ఘర్షణకు గల కారణాలేంటో తెలియాల్సి ఉందని అన్నారు. మరోవైపు.. సయ్యద్ మృతిపై ఆస్ట్రేలియాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఇది చాలా దురదృష్టకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే, విదేశీ వ్యవహారాలు, వాణిజ్య విభాగంతోపాటు పోలీసు అధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తామని తెలిపింది.
Kidney For Sale: భరణం కోసం భార్య వేధింపులు.. కిడ్నీ అమ్మకానికి పెట్టిన భర్త
తాజావార్తలు
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!