KCR: చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యే RDX బాంబులు పెట్టి పేల్చిండు
- పాలమూరుపై ఉమ్మడి పాలకుల ఘోర వివక్ష
- దత్తత పేరుతో అభివృద్ధి మోసం
- ఆర్డీఎస్ కాలువను పేల్చేశారన్న ఆరోపణ
- వలసల గోసకు ముగింపు తెచ్చిందే తెలంగాణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణ, ముఖ్యంగా పాలమూరు జిల్లా పట్ల పాలకులు ప్రదర్శించిన వివక్షను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ఎండగట్టారు. తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టులు ఉన్నా నీరు లేక పాలమూరు జిల్లా ఎడారిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకుంటున్నట్లు గొప్పలు చెప్పారని, కానీ క్షేత్రస్థాయిలో జరిగింది శూన్యమని కేసీఆర్ విమర్శించారు. “సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి” అనేది కేవలం ఒక స్లోగన్‌గా మాత్రమే మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. జూరాల ప్రాజెక్టు వల్ల ముంపునకు గురైన కర్ణాటక ప్రాంతానికి చెల్లించాల్సిన కేవలం 13 కోట్ల రూపాయల పరిహారాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదని, తాను బహిరంగ సభల్లో తీవ్రంగా ప్రశ్నించిన తర్వాతే ఆ నిధులు విడుదలయ్యాయని గుర్తుచేశారు.
Also Read
- IT Raids: హైదరాబాద్ టు హాంగ్‌కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
- Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
- Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
- Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) విషయంలో జరిగిన ద్రోహాన్ని కేసీఆర్ వివరించారు. 80 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ఆర్డీఎస్ కాలువను బాంబులు పెట్టి పేల్చివేసి, తెలంగాణ రైతులకు అందాల్సిన నీటిని అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ అన్యాయాన్ని లోకానికి చాటి చెప్పడానికే తాను జోగులాంబ నుండి గద్వాల వరకు మొదటి పాదయాత్ర చేపట్టానని ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో జూరాల – ఆర్డీఎస్ లింక్ కెనాల్ పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాలకు తెరలేపారని, కానీ రైతులకు ఒక్క చుక్క నీరు కూడా అందలేదని విమర్శించారు.
జిల్లా మొత్తం 100 శాతం కృష్ణా బేసిన్లో ఉన్నప్పటికీ, భయంకరమైన కరువును అనుభవించాల్సి వచ్చిందని కేసీఆర్ అన్నారు. ఈ దుర్భర పరిస్థితిని చూసే గోరేటి వెంకన్న వంటి కవులు “పల్లె పల్లెలో పల్లెర్లు మొలిసే పాలమూరులోన” వంటి గుండెలు పిండే పాటలు రాశారని చెప్పారు. ఈ పరిస్థితుల వల్లే ప్రజలు పొట్టచేత పట్టుకుని బొంబాయి వంటి ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ వెనకబడ్డ ప్రాంతం కాదని, ఉమ్మడి పాలకులు కావాలనే ఈ ప్రాంతాన్ని వెనకకు నెట్టివేశారని తాను వందల ఉపన్యాసాల్లో చెప్పిన మాటలు ఈ రోజు అక్షర సత్యాలుగా నిరూపితమయ్యాయని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఈ వివక్షకు ముగింపు పడిందని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Helicopter Crash: కూలిన హెలికాప్టర్.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐదుగురు అమెరికా పౌరులతో సహా ఏడుగురు మృతి
-
IT Raids: హైదరాబాద్ టు హాంగ్‌కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
-
Melania Trump: అమెరికా అధ్యక్షుడి భార్య ఎక్కడ? నెల రోజులుగా కనిపించని మెలానియా ట్రంప్!
ట్రెండింగ్
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!