IND-A Vs SL-A: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకలోని గాలే వేదికగా జూన్ 25 నుంచి ఇండియా ఏ, శ్రీలంక ఏ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా ఏ కెప్టెన్ ధ్రువ్ జురెల్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుత శతకంతో కదంతొక్కడంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. అయితే.. సాయి సుదర్శన్ 175 బంతుల్లో 19 ఫోర్ల సాయంతో 132 పరుగులు చేసి గుణశేఖర బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
అంతకుముందు ఓపెనర్ ఆయుష్ పాండే 25 పరుగుల వద్ద అవుట్ కావడంతో భారత్‌కు తొలి వికెట్ పడింది. ఆ తర్వాత లంచ్ విరామం అనంతరం వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో దేవదత్ పడిక్కల్ 12 పరుగులకే వెనుదిరిగాడు. నాలుగో స్థానంలో వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ కాసేపు ఇన్నింగ్స్‌ను నిలబెట్టినా, 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ కావడంతో భారత్ నాలుగో వికెట్ కోల్పోయి ప్రస్తుతం 259/4 స్కోరుతో కొనసాగుతోంది.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
ఇటీవలే శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్లతో జరిగిన ట్రై-నేషన్ సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇండియా ఏ జట్టు, ఇప్పుడు టెస్ట్ సిరీస్‌లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఆ ట్రై-నేషన్ సిరీస్ ఫైనల్లో 29 బంతుల్లో 94 పరుగులు చేసి అదరగొట్టిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ టెస్ట్ సిరీస్‌లో భాగం కాలేదు. ప్రస్తుతం అతడు సీనియర్ భారత జట్టుతో కలిసి ఐర్లాండ్ పర్యటనలో ఉన్నాడు. జూన్ 26న జరిగే ఐర్లాండ్ మ్యాచ్‌లో అతడు గనుక అరంగేట్రం చేస్తే, భారత అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడతాడు.
భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్, లైవ్ స్ట్రీమింగ్ సదుపాయం భారత్‌లో అందుబాటులో లేదు. కాబట్టి అభిమానులు కేవలం లైవ్ స్కోర్ అప్డేట్ల ద్వారానే మ్యాచ్‌ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇండియా ఏ తుది జట్టులో సాయి సుదర్శన్, ఆయుష్ పాండే, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, ధ్రువ్ జురెల్, షేక్ రషీద్, హర్ష్ దూబే, సారాంశ్ జైన్, అన్షుల్ కాంబోజ్, యశ్ ఠాకూర్, ఆకిబ్ నబీ దార్ లాంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లకు చోటు దక్కింది. సీనియర్ జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న యువ ఆటగాళ్లకు ఈ టెస్ట్ సిరీస్ చాలా కీలకం కానుంది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!