CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
- రూ.51 కోట్లతో 33 క్రెస్ట్ గేట్ల నిర్మాణం
- ముగ్గురు సీఎంలతో ఘన ప్రారంభోత్సవం
- ఆర్డీఎస్ వాటాపై రేవంత్ ఫోకస్
- జలవివాదాలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాలను తీర్చే ప్రధాన వరప్రదాయిని తుంగభద్ర డ్యామ్ సరికొత్త రూపు సంతరించుకుంది. గత 2024 వరదల్లో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో, నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు నిర్మించిన 33 క్రెస్ట్ గేట్లను గురువారం (జూన్ 25) ముగ్గురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో కలిసి ఘనంగా ప్రారంభించారు. రూ. 51 కోట్ల వ్యయంతో కేవలం 6 నెలల రికార్డు కాలంలోనే ఈ గేట్ల నిర్మాణాన్ని పూర్తి చేయడం విశేషం.
మూడు తరాల సమస్యకు శాశ్వత పరిష్కారం
గేట్ల ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఈ 33 గేట్ల పునరుద్ధరణ ముహూర్తం అంతర్రాష్ట్ర జలవనరుల చరిత్రలో నిలిచిపోతుంది. మూడు తరాలుగా ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య నేటితో తీరబోతోంది” అని సీఎం ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ పనితీరును కొనియాడుతూ.. తక్కువ మాట్లాడటం, వేగంగా పని పూర్తి చేయడం ఆయన ప్రత్యేకతని, ఆయన నాయకత్వంలో ఈ ప్రాంత సాగు, తాగునీటి కష్టాలన్నీ నూటికి నూరుపాళ్లు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ఆర్డీఎస్ వాటా, తుంగభద్ర పూడికతీతపై ఫోకస్
సభా ముఖంగా తెలంగాణ ఎదుర్కొంటున్న జల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) కింద తెలంగాణకు ఉన్న హక్కుల్లో ప్రస్తుతం కేవలం 5 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకోగలుగుతున్నామని ఆయన గుర్తు చేశారు. తుంగభద్ర జలాశయంలో భారీగా పేరుకుపోయిన పూడిక సమస్యను కూడా త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా కేంద్రం, పొరుగు రాష్ట్రాలు చొరవ చూపాలని కోరారు.
రాజకీయాలకు అతీతంగా అంతర్రాష్ట్ర జలవివాదాల పరిష్కారం
“తుంగభద్రమ్మ సాక్షిగా ఈ ప్రాంత రైతాంగ సమస్యలన్నీ పరిష్కారం కావాలి. ఇందుకోసం పొరుగు రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా, తుంగభద్ర నది ఒడ్డునే కూర్చుని చర్చల ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ చారిత్రాత్మక అడుగుతో అంతర్రాష్ట్ర జలవివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!