Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్‌కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
- సీఎం సువేందును కొద్దిగా ఆపాలని కోరిన బంగ్లాదేశ్ ఎంపీ..
- ఆయన వ్యాఖ్యలతో భారత్-బంగ్లా సంబంధాల్లో ఇబ్బందులు..
- బంగ్లాదేశ్ పార్లమెంట్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసిన అధికార పార్టీ నేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి నిర్ణయాలు, వ్యాఖ్యలు బంగ్లాదేశ్‌కు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ఇన్నాళ్లు అత్తగారి ఇంటిలా బంగ్లాదేశ్ నుంచి బెంగాల్‌కు వలసలు సాగేవి. బీజేపీ ప్రభుత్వ రాకతో అక్రమ చొరబాటుదారులు సొంత దేశానికి పారిపోతున్నారు. ఇదే కాకుండా, బంగ్లాదేశీయుల్ని హెచ్చరిస్తూ సీఎం సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటిపై బంగ్లాదేశ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారత్-బంగ్లాదేశ్ సంబంధాలపై బంగ్లా పార్లమెంట్లో కీలక చర్చ జరిగింది. అధికార బీఎన్పీ ఎంపీ గులాం మహహ్మద్ సిరాజ్ మాట్లాడుతూ.. బెంగాల్ సీఎం సువేందు అధికారి చేస్తున్న వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను కట్టడి చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. సీఎం సువేందు తరుచుగా బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, ఆయన చేస్తున్న ప్రకటనలు రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉందని అన్నారు. ‘‘ నేను స్పీకర్ ద్వారా భారత ప్రభుత్వానికి చెప్పాల్సింది ఒకటే. పశ్చిమ బెంగాల్ నాయకుడు సువేందు బాబును అడ్డుకోవాలి. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు భారత్-బంగ్లా స్నేహానికి అనుకూలంగా లేవు’’ అని అన్నారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం బంగ్లాదేశ్ రాజకీయాల్లో అంశం కాదని, ఆమెకు ప్రస్తుత పరిణామాలతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. షేక్ హసీనా ముగిసిన అధ్యాయం అని అన్నారు. ఆమె గురించి తమకు ఎలాంటి ఆందోళన లేదని ఎంపీ చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాల్ని బలోపేతం చేయాలని సూచించారు. ఇద్దరు స్నేహితులు, భార్యభర్తలు విడిపోవచ్చు, కానీ ఇరుగుపొరుగు మధ్య ఉన్న సంబంధాలకు విడాకులు ఉండవని, బంగ్లాదేశ్-భారత్ ఎప్పటికీ పొరుగుదేశాలుగానే ఉంటాయని అన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!