KCR: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణ, ముఖ్యంగా పాలమూరు జిల్లా పట్ల పాలకులు ప్రదర్శించిన వివక్షను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ఎండగట్టారు. తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టులు ఉన్నా నీరు లేక పాలమూరు జిల్లా ఎడారిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకుంటున్నట్లు గొప్పలు చెప్పారని, కానీ క్షేత్రస్థాయిలో జరిగింది శూన్యమని కేసీఆర్ విమర్శించారు.…