SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
- విడుదలైన SSC సప్లిమెంటరీ ఫలితాలు
- 82.61 శాతంతో మెరుగైన ఉత్తీర్ణత
- బాలురపై మరోసారి బాలికల ఆధిక్యం
- మూడు జిల్లాల్లో 100% రిజల్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSC Supplementary Results : తెలంగాణ పదో తరగతి (SSC) అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. జూన్ 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. రెగ్యులర్ ఫలితాల మాదిరిగానే ఈ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లోనూ బాలికలే మరోసారి తమ ఆధిక్యాన్ని చాటుకున్నారు. ఈ ఏడాది పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం మొత్తం 31,736 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా.. వారిలో 27,857 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో రికార్డు స్థాయిలో 23,013 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంతో మొత్తం ఉత్తీర్ణత శాతం 82.61 శాతంగా నమోదైంది.
మరోసారి ఫలితాల్లో బాలికలు అదరగొట్టారు. పరీక్షలకు హాజరైన వారిలో 17,568 మంది బాలురు ఉండగా, అందులో 14,281 మంది పాసయ్యారు. అంటే బాలుర ఉత్తీర్ణత శాతం 81.29 శాతంగా ఉంది. అదేవిధంగా పరీక్ష రాసిన 10,289 మంది బాలికల్లో 8,732 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 84.87 శాతంగా నమోదైంది. మొత్తంగా బాలికలు బాలుర కంటే 3.58 శాతం అధిక ఉత్తీర్ణత సాధించి ముందంజలో నిలిచారు. ఈ ఫలితాల్లో జిల్లాల వారీగా చూస్తే.. జయశంకర్ భూపాలపల్లి, సిద్ధిపేట, ములుగు జిల్లాలు 100 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించాయి. కాగా, వికారాబాద్ జిల్లా కేవలం 44.43 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది.
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
తాజావార్తలు
-
By Election Results: తమిళనాడు బైపోల్స్లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
-
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Noida Airport: నోయిడా ఎయిర్పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు