MLC Kavitha: జగిత్యాల జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కళ్ళు తిరిగి పడిపోయారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. డిహైడ్రేషన్ వల్ల ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారని విశ్వనీయ సమాచారం. రాయికల్ మండలం ఇటిక్యాలలో రోడ్ షో లో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సంజయ్ పాల్గొన్నారు.
Read also: Vijayashanti: నోరు అదుపులో పెట్టుకోండి.. రాములమ్మ మాస్ వార్నింగ్..
రాయికల్ మండలం ఇటిక్యాలలో ప్రచార వాహనంలోనే ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూనే ఒక్కసారిగా స్పృహ తప్పి వాహనంలోనే పడిపోయారు. దీంతో అక్కడే వున్న మహిళా నాయకులు, పార్టీ శ్రేణులు వాహనంలోనే కవితను పడుకోబెట్టారు. కవితకు ఎండ తగటకుండా చూసుకున్నారు. కవిత ముఖంపై నీటితో తుడిచి కాసేపు సేద తీర్చుకోవాలని సలహా ఇచ్చారు. అయినా కవిత పైకి లేచేందుకు ట్రై చేశారు. కానీ కవిత వల్లకాలేదు. తలను గట్టిగా పట్టుకుని పడుకున్నారు. అక్కడ వున్నవారు లేవకూడదని కాసేపు సేద తీర్చుకోవాలని కోరడంతో కవిత కాసేపు వాహనంలో సేదతీరారు. కొద్దిసేపు తరువాత మళ్ళీ తేరుకొన్న ఎమ్మెల్సీ కవిత ఎన్నికల ప్రచారంలో ప్రసంగించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Vijayashanti: నోరు అదుపులో పెట్టుకోండి.. రాములమ్మ మాస్ వార్నింగ్..