Thummala: పొంగులేటిపై తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు.. మేం శత్రువులం కాదు.. కానీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thummala: పొంగులేటి నేను ఎప్పటికి శత్రువులం కాదు కేవలం ప్రత్యర్థులం మాత్రమే అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలంలో ముఖ్యకార్యకర్తల సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ… నేను బయట అయితే మాట్లాడతాను కాని నన్ను పెంచిన వాళ్ళ ముందు మాట్లాడాలి అంటే కొంచెం కష్టమే అన్నారు. టిడిపి జెండా జన్మనిచ్చిందని అన్నారు. పామ్ ఆయిల్ మొక్క నాటింది మొదటిగా ఎన్.టి. రామారావు గారే అన్నారు. నన్ను మొదటి సరిగా నాకు అవకాశం ఇచ్చి నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడే అనుకున్నాం మనకు ఈ పరిస్థితి వస్తుందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 5 మండలాల ప్రజలు ప్రతి మండలానికి నేను అభివృద్ధి చేసానని అన్నారు. మేము శత్రువులం కాదు ప్రత్యర్థులం మాత్రమే అందుకే గ్రామ స్థాయి కార్యకర్త నుండి అందరు నన్ను పొంగులేటిని కాంగ్రెస్ పార్టీ లోకి రమ్మని ఆహ్వానించారని అన్నారు.
40 సంవత్సరాలుగా మేమిద్దరం ఎలా అభివృద్ధి చేసామో అలాగే అభివృద్ధి చేస్తాం అన్నారు. ఏ గ్రామానికి ఏమి కావాలో మీకన్నా మాకే ఎక్కువ తెలుసన్నారు. మేము మీ మనుషులం ఇన్ని రోజులు రాజకీయాల్లో బ్రతికి ఉన్నాం ఆంటే కేవలం మీ వల్లే అన్నారు. మమ్మల్ని ఎలా ఆదరించారో అలాగే జారే ని కూడా ఆధారించాలని కోరుకుంటున్నామన్నారు. పామ్ ఆయిల్ రేటు కాని నర్సరీలకు ఉన్న సమస్యలు కాని రాహుల్ గాంధీతో మాట్లాడి అన్ని సమస్యలు తీరుస్తా అని మాటిస్తున్న అన్నారు.
ఇందిరా గాంధీ తుపాకీ తూటలకు బలి అయ్యారు రాజీవ్ గాంధీ బాంబు దాడిలో బలి అయ్యారని తెలిపారు. టక్కు టమారా విద్యలు చుపె వారికి దూరంగా ఉండాలన్నారు. రాహుల్ కి ప్రధానమంత్రిగా అవకాశం వచ్చిన తీసుకోకుండా వేరే వారికి ఇచ్చారని తెలిపారు. మేము ఎప్పటికి శత్రువులం కాదు కేవలం ప్రత్యర్థులం మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. సత్తుపల్లి అశ్వారావుపేట నియోజలవర్గాలు అంటే మంచి మనసు తెలివి అన్నదమ్ముల వలే కలిసిమెలిసి ఉన్నామన్నారు. నియోజకవర్గానికి ఏ కష్టం వచ్చిన మేము ఇద్దరం ఉన్నాం జారే ని మీరు గెలిపించండి మిమ్మల్ని మేము చూసుకుంటామన్నారు.
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
40 సంవత్సరాలు నేను ఉప్పు కారం తినే వ్యక్తినే మీరు జారే ని గెలిపించండి మేమున్నామన్నారు. మీకోసం మీ అభివృద్ధి కోసం మేమున్నామన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో పామాయిల్ రైతు తల ఎత్తుకు తిరిగేలా చేస్తా అన్నారు. అన్నీ పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ తో జత కట్టాయన్నారు. భర్తను, అత్తను కోల్పోయినా కూడా వెనకడుగు వేయకుండా సోనియా నిలబడిందని తెలిపారు. రాష్ట్రాన్ని దోచుకునే వారిని తిప్పి కొడదామన్నారు. రాహుల్ నీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేశారు. అయినా రాహుల్ జంకలేదని అన్నారు. రాహుల్ వ్యక్తిత్వం నాకు నచ్చిందని తెలిపారు. పొంగులేటినీ.. నన్ను.. ఇద్దరు వేరు వేరుగా కాకుండా కలిసి ఉండాలని రాహుల్ కోరారని అన్నారు. వారి సూచనలతో మేము ఇద్దరం కలిసి ముందుకు వస్తున్నామని తెలిపారు. పొగాకు రైతుగా సైకిల్ మీద వెళ్ళామన్నారు. ఇప్పుడు పామాయిల్ వ్యవసాయంతో కార్లు కొన్నామన్నారు. జబేదార్ల ముందు వొంగి వొంగి బతకాల్సిన పనిలేదన్నారు. ఏ అవసరం వచ్చినా మీ ముందు వుంటామన్నారు. కాంట్రాక్టు బిల్లులు అవలేదనో వేరే కారణాలతోనో తల దాచుకున్న వారిని పట్టించుకోవద్దన్నారు. నేను పార్టీ లోకి ఎవరిని రమ్మని అడగను, అది వాళ్ళ విజ్ఞత అన్నారు. మీ చిరునవ్వు కోసం మా జీవితాన్ని త్యాగం చేస్తామన్నారు. శ్రీరామచంద్రుడి ఆశీస్సులతో మనం విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Pepper Motion: కుదిరిన ఎంవోయూ.. ఏపీలో ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ వాహన యూనిట్
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!