ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లు మారడం లేదు. రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడొక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా బెంగళూరులో కళాశాల క్యాంపస్‌లోనే పట్టపగలు విద్యార్థినిపై స్నేహితుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. స్నేహం పేరుతో హోటల్‌కు పిలిచి సహచర విద్యార్థినిపై ఎంబీబీఎస్ విద్యార్థి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా వీడియోలు లీక్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో చేసేదేమీలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది చార్లీ కిర్క్ హత్య అమెరికాను కుదిపేసింది. ఉతా వ్యాలీ యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా ఒక తూటాకే చార్లీ కిర్క్ కుప్పకూలిపోయాడు. ఇక చార్లీ కిర్క్ హత్య తర్వాత ఎఫ్‌బీఐ అధికారులు వేట సాగించారు.
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా నేరాలు మాత్రం తగ్గడం లేదు. ఎక్కడొక చోట నేరాలు-ఘోరాలు జరుగుతూనే ఉంటున్నాయి. రోజురోజుకూ నేర తీవ్రత పెరిగిపోతుంది తప్ప తగ్గడం లేదు. స్నేహితుడి చెల్లిని ప్రేమించిన పాపానికి ప్రియుడిని అత్యంత క్రూరంగా చంపేసి అవయవాలు నదిలో విసిరేశారు. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
స్నేహితులే కాలయములుగా మారి భార్యను అసభ్యకరంగా దూషించడనే నేపంతో స్నేహితుడిని హత్య చేశాడు . రైల్వే స్టేషన్ లో సమోసాలు అమ్ముకునే ఇద్దరు స్నేహితుల మధ్య మద్యం మత్తులో వివాదం ఏర్పడింది. ఈ వివాదంలో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. తన భార్యను అసభ్యకరంగా మాట్లాడటంతో ఈ హత్యకు దారితీసింది. రాఖీ పండుగ రోజున జరిగిన ఈ హత్య సంచలనంగా మారింది..
పూణె అత్యాచార ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. పోలీసుల దర్యాప్తులో విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు చెప్పిన మాటలకు ఖాకీలే షాక్ గురయ్యారు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులకు.. విషయం తెలిసి మైండ్ బ్లాక్ అయింది.
అంగుళం భూమి అయినవారి మధ్య చిచ్చుపెడుతోంది. భూమి కోసం అన్నదమ్ములు, అక్కాచెల్లెల్లు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఆఖరికి ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడటం లేదు. తల్లిదండ్రులను సైతం అంతమొందిస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భూమి కోసం ఓ అన్న తన తమ్ముడి స్నేహితుడిని హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. Also Read:Anchor Swecha: యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసు.. పూర్ణచంద్ర నాయక్ ను అరెస్ట్ చేసి రిమాండ్…
తన భార్య గురించి తప్పుగా మాట్లాడాడంటూ స్నేహితుడిపై కత్తితో దాడి చేశాడో భర్త.. తన భార్యపై మాట్లాడిన మాటలు జీర్ణించుకోలేక క్షణికావేశంలో.. చికెన్ కొట్టే కత్తితో స్నేహితుడి మెడపై దాడి చేయడంతో.. అతడి పరిస్థితి విషమంగా మారింది.. ఈ ఘటన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలకలం సృష్టించింది..
చిత్తూరులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. చిత్తూరు రూరల్ చెర్లోపల్లిలో జరిగిన ఘటనపై పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. జూన్ 12వ తేదీన ఇంట్లో మంచంపై విగతజీవిగా పడి ఉన్న సరోజ అనే మహిళది సహజ మరణంగా భావించారు. జూన్ 13వ తేదీన అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అయితే, సరోజ కొడుకు కన్నన్ కు ఒక బాలుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆరా…
మరణం ఎప్పుడు.. ఎలా సంభవిస్తుందో ఎవరికి తెలియదు.. నీటి బుడగలాంటిది జీవితం అంటారు. కళ్ల ముందు తిరిగిన వ్యక్తులే.. ఆ కాసేపట్లోనే కనుమరుగు అయిపోవడం నిజంగా విచారకరమే. ఈ మధ్య మరణాలు చాలా విచిత్రంగా జరుగుతున్నాయి. ఉన్నట్టుండే ప్రాణాలు కోల్పోతున్నారు.