జనగామ జిల్లాలో కుల బహిష్కరణ కలకలం రేపింది. జనగామ మండలం ఓబుల్ కేశవపురం గ్రామంలో తమ కులాన్ని బహిష్కరించారంటూ కుమ్మరి కులస్థుల ఆవేదన వ్యక్తం చేసింది. దళితులకు సహాయం చేశారనే కోపంతో కుమ్మరి కులస్థులను ఓసీ కులస్థులు గ్రామం నుంచి బహిష్కరించారు. ఈ వ్యవహారంపై కుమ్మరి కులస్థులు డీసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. గ్రామంలోని అన్ని కులాలు కలిసి తమపై కక్షపూరిత ధోరణిలో వ్యవహారిస్తున్నారని పేర్కొన్నారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్‌కు ఫిర్యాదు అందగా.. విచారణ జరుపుతామని హామీ…
Raghunathpally birthday party stabbing: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో దారుణం చోటుచేసుకుంది. బర్త్ డే పార్టీ వేడుకల్లో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. ఎంగిలి గ్లాసులో తనకు మద్యం పోస్తారా? అంటూ ఇద్దరి స్నేహితులపై మరో స్నేహితుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో కత్తి పోట్లకు గురైన ఓ యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న రఘునాథపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.…
మహిళా రక్షణ కోసం ప్రభుత్వాలు కఠిన చట్టాలను తీసుకొచ్చి అమలు చేస్తున్నప్పటికీ కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. తాజాగా జనగామ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఇద్దరు బాలికలు, ఒక అబ్బాయితో 60 ఏళ్ల వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తించాడు. పిల్లలు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పాలకుర్తి పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. Also Read:Pawan Kalyan: రప్పా రప్పాపై పవన్ కౌంటర్.. బరిలోకి దిగి చూపించు.. జగన్ కు…
జనగామ జిల్లాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్నపేగు బంధాన్ని తెంచుకుంటూ.. ఓ తల్లి రోడ్డు పక్కన పసికందును వదిలేసి వెళ్లిపోయింది. పసిబిడ్డ ఏడుపు విన్న స్థానికులు.. స్నానం పోసి అక్కున చేర్చుకున్నారు. పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా ఆ బిడ్డ తల్లిదండ్రులు కనిపించలేదు. దాంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముక్కు పచ్చలారని పసికందును బహిరంగ ప్రదేశంలో వదిలేసిన ఘటన జిల్లాలో ఇప్పుడు కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం… జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామంలో…
జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ శివారు జాతీయ రహదారిపై లారీని వెనక నుంచి ఢీకొట్టింది కారు. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ప్రమాద స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. హనుమకొండ నుంచి హైదరాబాద్ కియా…
నేడు జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హెలికాప్టర్ లో శివునిపల్లెకు చేరుకోనున్నారు సీఎం. అక్కడ ఏర్పాటు చేసిన ఇందిరామహిళా శక్తి స్టాల్స్‌ను పరిశీలించనున్నారు.
టిప్పు సుల్తాన్ వారసుడినని... ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి కోట్లు కాజేసిన ఓ ప్రైవేట్ వైద్యుడిని జనగాం పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ సుల్తాన్ రాజ్.. టిప్పు సుల్తాన్ ట్రస్ట్ చైర్మన్‌గా చలామణి అవుతున్నాడు.
జనగామ జిల్లా ఏర్పడిందంటే అది మాజీ సీఎం కేసీఆర్ కృషితోనే అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఉమ్మడి పాలనలో జనగామ ప్రాంతం అన్యాయానికి గురైందని, ప్రత్యేక జిల్లా ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాతే జిల్లా ఏర్పడడం కాకుండా.. జిల్లా అభివృద్ధికి బాటలు పడ్డాయన్నారు. బీసీ ఉద్యమాలు చేసి.. బీసీలకు న్యాయం చేసే లాగా కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ప్రయత్నం చేసిందన్నారు. ప్రభుత్వం బిల్లులు సక్రమంగా పెట్టి బీసీ…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు పెంబర్తి గ్రామంలోని విశ్వకర్మ హస్తకళల కేంద్రంను కవిత సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రేఖ రాజ్‌ను పరామర్శిస్తారు. ఉదయం 11.30కి పెంబర్తి గ్రామ్ పంచాయత్ కార్యాలయం వద్ద ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతారు. Also Read: Champions Trophy 2025: ఐదుగురు స్టార్స్…
జనగామ జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ రోడ్డులోని ‘జై భవాని’ హార్డ్ వేర్, ఎలక్ట్రికల్ అండ్ పెయింటింగ్ షాపులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా.. ఫైర్ సిబ్బంది వెంటనే అలెర్ట్ అయింది. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని జనగామ పట్టణ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. Also Read: Shubman…