Israel-Hamas War: గత శనివారం ఇజ్రాయిల్‌పై క్రూరమైన మారణకాండకు నాయకత్వం వహించిన హమాస్ ఉగ్రసంస్థ కమాండర్‌ని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) హతమార్చాయి. డ్రోన్ దాడిలో టాప్ కమాండర అలీ ఖాదీని డ్రోన్ దాడిలో చంపినట్లు శనివారం ఐడీఎఫ్ ప్రకటించింది. ఇతను హమాస్ అత్యంత ముఖ్యమైన ఎలైట్ గ్రూప్ ‘నుఖ్బా’ ఫోర్సుకి చీఫ్‌గా వ్యవహరిస్తున్నాడు. అక్టోబర్ 7న గాజా నుంచి ఇజ్రాయిల్ భూభాగంలోకి ప్రవేశించిన ఉగ్రవాద బృందానికి అలీ ఖాదీ చీఫ్.
‘‘ఖచ్చితమైన ఐడీఎఫ్, ఐఎస్ఏ నిఘా సమాచారం మేరకు ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ విమానం హమాస్ ‘నుఖ్బా’ కమాండో ఫోర్స్2కి చెందిన కంపెనీ కమాండర్ అలీ ఖాదీని హతమార్చింది. ’’ అంటూ ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ ఎక్స్(ట్విట్టర్)లో ప్రకటించింది. 2005లో ఇజ్రాయిల్ పౌరులను కిడ్నాప్, హత్యలకు పాల్పడిన అలీ ఖాదీని ఇజ్రాయిల్ అరెస్ట్ చేసింది. అయితే గిలాడ్ షాలిత్ ఖైదీల మార్పిడిలో భాగంగా విడుదల చేయబడ్డాదని ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది.
Read Also: Group-2 Student Case: ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం.. పోలీసుల కీలక ప్రకటన
ఇజ్రాయిల్ లో అక్టోబర్ 7న అమానవీయ, అనాగరికమైన పౌరుల ఊచకోతకు అలీ ఖాదీ నాయకత్వం వహించాడు, మేము అతడిని అంతమొందించాం. మిగతా హమాస్ ఉగ్రవాదులందరికీ ఇదే గతి పడుతుందని ఐడీఎఫ్ హెచ్చరించింది. ఇప్పటికే హమాస్ వైమానికి దళానికి చీఫ్ గా ఉన్న మరో ఉగ్రవాది హమాస్ వైమానిక దళాల చీఫ్ మురాద్ అబు మురాద్‌ని హతం చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ నివేదించింది.
గతంలో ఎప్పుడు లేనంతగా ఇజ్రాయిల్-పాలస్తీనా హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం మొదలైంది. గత శనివారం హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 1300 మంది చనిపోగా, వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. హమాస్ ఉగ్రవాదులు 150 మంది వరకు ఇజ్రాయిలీలను బందీలుగా తీసుకుని గాజాకు తరలించారు. మరోవైపు ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై భీకరదాడి చేస్తోంది. ఈ దాడిలో వేల సంఖ్యలో మంది చనిపోయారు.