టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అట్టర్ ప్లాప్ అవుతుందని అన్నారు. పైసలకు అమ్ముడు పోయే వ్యక్తి రేవంత్ రెడ్డి అని... మొదటి నుండి ఆయన గుణం అదేనని తెలిపారు. డబ్బులకు టికెట్లు అమ్ముకునే వ్యక్తి రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు.
పొన్నాల వివాదం ఏంటి సార్ అని మీడియా ప్రతినిధులు అడగ్గా.. వివాదం ఏంటిదో నాకు తెలియదు. నువ్వు తెలుసుకొని వచ్చి నాకు అడిగితే అప్పుడు చెబుతానంటూ సీరియస్ గా మాట్లాడారు జానారెడ్డి.
ఆ ఇద్దరికి మొదటి నుంచి పడదు. గతంలో వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. గడిచిన ఎన్నికల్లో ఇద్దరూ ఒకే గూటికి చేరుకున్నారు కూడా. ఆ సమయంలో ఒక ఒప్పందం జరిగిందట. ఇప్పుడా అగ్రిమెంట్ రుచించలేదో ఏమో.. ఒకే వరలో రెండు కత్తులు ఇమడలేవన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఇంతకీ ఎవరా నేతలు..? ఏంటా ఒప్పందం..? రచ్చబండతో రచ్చ రచ్చ పీసీసీ మాజీ చీఫ్.. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా…