Kadiyam Srihari: నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సన్నాక సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు.. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం.. మరోవైపు, స్పీకర్ గడ్డం ప్రసాద్.. పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యేల వివరణ తీసుకుంటున్న సమయంలో.. తన రాజీనామాపై జరుగుతోన్న ప్రచారంపై స్పందించిన కడియం శ్రీహరి.. నేను రాజీనామా చేయడం లేదని స్పష్టం చేశారు.. అయితే, స్పీకర్ నిర్ణయం తర్వాత నా కార్యాచరణ ఉంటుందని.. ఏ నిర్ణయమైనా నియోజకవర్గ ప్రజల…
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. కోర్టులో హాజరుపరచే ముందు.. వైద్య పరీక్షల కోసం ఎంజీఎంకు తరలించారు. ఆస్పత్రిలోకి వెళ్లే ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదు.. ఈ కాంగ్రెస్ సర్కార్ 20% కమీషన్ సర్కార్.. పోలీస్ ఆఫీసర్ల దగ్గర కమీషన్స్ తీసుకుంటున్నారు ఎమ్మెల్యే నాగరాజు.. అక్రమ మైనింగ్ చేస్తున్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోకపోవడం హాస్యస్పదం.." అని వ్యాఖ్యానించారు. అంతలోపే…
ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘనపూర్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం బీఆర్ఎస్ నాయకులు,శ్రేణులపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. ‘అధికారం లేకపోవడంతో… బిఆర్ఎస్ నాయకులు మతిభ్రమించి, పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. పదవి, అధికారం లేకుండా ప్రజలకు సేవ చేసే అలవాటు బిఆర్ఎస్ శ్రేణులకు లేదు అని మండిపడ్డారు. పత్రికా సమావేశాలు పెట్టి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడమే ప్రతిపక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. Also Read: Zee…
పక్క రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ కు అదనంగా అనేక నిధులు కేటాయించారు.. తెలంగాణకు మాత్రం అన్యాయం చేశారని ఆరోపించారు. కేంద్రానికి ఎన్నో విజ్ఞాప్తులు చేశాం.. కానీ పట్టించుకోవడం లేదు.. తెలంగాణ ఇంతకీ భారతదేశంలో లేదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పన్నులు కడుతుంటే.. రాష్ట్రానికి మోడీ సర్కార్ మాత్రం మొండి చేయి చూపిస్తుందని కడియం శ్రీహరి అన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాటలకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్పందించారు. నీది నాలుక తాటి మట్ట.. అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పది సంవత్సరాలు కేసీఆర్ కుటుంబంతో కూడి పొగిడిన వ్యక్తివి నువ్వు కాదా అని దుయ్యబట్టారు. అవకాశవాది నుంచి అవినీతి మాట రావడం సిగ్గుచేటు అని అన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తున్న రేవంత్ రెడ్డి సానుభూతి పొందడానికే తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని రాజయ్య అన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత ఇప్పటికే జైలుకు వెళ్లింది.. కేటీఆర్ కూడా రేపో మాపో అరెస్టు అవుతారని అన్నారు. హరీష్ రావు, కేసీఆర్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులపై దాడులు చేయడానికి రైతులను ఉసిగొలుపుతున్నారని అన్నారు. కేటీఆర్‌కు పార్టీని ఎవరు ఏం చేస్తారో అని.. గతంలో చేసిన తప్పులకు ఎప్పుడు జైలుకు పోవాల్సి వస్తుందో అని రెండు భయాలు ఉన్నాయని అన్నారు. ప్రజల్లో సానుభూతి కోసమే జైలుకు పోతానంటున్నారని కడియం శ్రీహరి చెప్పారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో మాజీ ఎమ్మెల్యే రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి పైనా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. 13 సంవత్సరాలుగా రాయి మీద రాయి పేర్చినట్టుగా కార్యకర్తలు సైనికులాలగా కష్టపడి పార్టీని నిర్మించామని ఆయన తెలిపారు.