Korean Kanakaraju Collections: వరుణ్ తేజ్‌కు బ్రేక్ఈవెన్.. 3 రోజుల్లోనే 37 కోట్లు కొల్లగొట్టిన ‘కొరియన్ కనకరాజు’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Korean Kanakaraju Collections: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ మంచి విజయాన్నే అందుకుంటోంది. పెయిడ్ ప్రీమియర్స్ నుంచే మొదలైన పాజిటివ్ టాక్ తో క్రమంగా థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా కేవలం మూడు రోజుల్లోనే సినిమా బ్రేక్ఈవెన్ మార్క్‌ను దాటి ప్రాఫిట్ జోన్లోకి వెళ్లింది. మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’లో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించగా, రితికా నాయక్ కథానాయికగా కనిపించారు. సత్య, మురళీధర్ గౌడ్, చిన్న, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.
ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే మంచి స్పందన లభించింది. అయితే రెండో రోజు నుంచి కలెక్షన్లలో మెరుగుదల కనిపించడంతో చిత్రబృందం కూడా ఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం, ఆదివారం కలెక్షన్లు పెరగడంతో తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.37.4 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. సినిమా బాక్సాఫీస్ విజయంలో పాజిటివ్ మౌత్ పబ్లిసిటీ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. పెయిడ్ ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన క్రమంగా ఇతర ప్రేక్షకులకు చేరడంతో థియేటర్లలో ఆక్యుపెన్సీ పెరిగింది. సాధారణంగా తొలి వారాంతం తర్వాత సోమవారం వసూళ్లలో కొంత తగ్గుదల కనిపిస్తుంది. కానీ ‘కొరియన్ కనకరాజు’ విషయంలో అడ్వాన్స్ బుకింగ్స్ బలంగా ఉండటంతో సోమవారం కూడా మంచి రన్ కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read
- Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
- Srinidhi Shetty: ఆ ఛాన్స్ ఎలా వచ్చిందో నాకే తెలీదు
- Aadarsha Kutumbam Trailer: 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్లో వెంకీ మామ వైలెంట్ అవతార్ చూశారా!
- Thaman: త్రివిక్రమ్ వల్లే 'ఓజీ' సాధ్యమైంది: మ్యూజిక్ డైరెక్టర్ తమన్
తెలంగాణలో సోమవారం బోనాల పండుగ సెలవు కూడా సినిమాకు కలిసొచ్చే అంశంగా మారింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా ఉండటంతో సెలవు రోజున మరింత మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన సినిమాకు లాంగ్ రన్ అవకాశాలను పెంచుతోంది. ‘కొరియన్ కనకరాజు’లో హారర్ కంటే కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఉండటం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అంశాల్లో ఒకటిగా మారింది. వరుణ్ తేజ్, సత్య కాంబినేషన్ సినిమాలో ఎంటర్టైన్మెంట్ను పెంచిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భయపెట్టే సన్నివేశాలతో పాటు లైట్ హార్టెడ్ కామెడీని మిక్స్ చేయడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను ఆస్వాదిస్తున్నట్లు తెలుస్తోంది.
ఓవర్సీస్ మార్కెట్లోనూ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో ‘కొరియన్ కనకరాజు’ ఇప్పటికే 500 వేల డాలర్ల మైలురాయికి చేరువలో ఉంది. ప్రస్తుత ట్రెండ్ ఇదే విధంగా కొనసాగితే, వన్ మిలియన్ డాలర్ల మార్క్ ను దాటే అవకాశం కూడా లేకపోలేదని తెలుస్తోంది. చాలా కాలం తర్వాత వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ మంచి హిట్ కొట్టాడు. సినిమా కంటెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ కావడం, పాజిటివ్ మౌత్ టాక్ పెరగడం, వీకెండ్ కలెక్షన్లు బలంగా ఉండటం వంటి అంశాలు ఈ విజయానికి కారణంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సినిమా పెట్టుబడిని రికవర్ చేసే దశను దాటి లాభాల బాటలోకి వెళ్లింది ఈ మూవీ. ఇక ముందున్న రోజులు సినిమాకు కీలకం కానున్నాయి. సోమవారం సెలవు, అడ్వాన్స్ బుకింగ్స్, ఫ్యామిలీ ఆడియన్స్ స్పందన కలిసి వస్తే ‘కొరియన్ కనకరాజు’ లాంగ్ రన్ సాధించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
PM Kisan: పీఎం కిసాన్ రైతులకు శుభవార్త.. ఆ రోజే డబ్బులు ఖాతాల్లోకి జమ..
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!